Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : నినాదాలతో దద్దరిల్లిపోతున్నమండలి !
By: Tupaki Desk | 21 Jan 2020 12:26 PMఏపీ లో ప్రస్తుతం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మూడు రాజధానుల బిల్లు ఆమోదం కోసం - సిఆర్డీఏ బిల్లు రద్దు చేయడం కోసం ఏపీ ప్రభుత్వం ఈ ప్రత్యేక సమావేశాలని ఏర్పాటు చేసింది. ఇక ఈ సమావేశాలు ప్రారంభమైన తోలి రోజే అసెంబ్లీ లో ఈ రెండు బిల్లులని ప్రవేశపెట్టి.. తమకి ఉన్న సంఖ్యా బలంతో ఈబిల్లులకి ఆమోద ముద్ర వేశారు. దీనితో నేడు మంగళవారం ఈ బిల్లులు శాసనమండలి ముందుకు వచ్చాయి. అయితే, అసెంబ్లీ లో వైసీపీకి పూర్తీ మెజారిటీ ఉన్నప్పటి కూడా శాసనమండలిలో మాత్రం టీడీపీ దే ఆధిపత్యం అని చెప్పాలి.
దీనితో టీడీపీ - వైసీపీ పోటాపోటీ నినాదాలతో శాసనమండలి హోరెత్తుతోంది. రూల్ 71పై చర్చ తర్వాతే ఏ అంశాన్నైనా చేపట్టాలని టీడీపీ పట్టుబట్టడం తో - బిల్లులను చర్చకు రానివ్వకుండా అడ్డుకోవడం ద్వారా రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్నారని వైసీపీ మండిపడింది. వెంటనే రూల్ 71 కింద చర్చను ప్రారంభించాలని చైర్మన్ షరీఫ్ ఆదేశించారు. దీనితో టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చర్చను ప్రారంభించారు. దీంతో వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోడియం వద్దకు దూసుకువచ్చారు. బిల్లులపై చర్చ ప్రారంభించాల్సిందేనని వైసీపీ సభ్యులు పట్టుబడుతూ పోడియం వద్దకు దూసుకు వచ్చి నినాదాలు చేశారు. మరోవైపు రూల్ 71 కింద చర్చ ప్రారంభించాలని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో శాసనమండలిలో తీవ్ర గందరగోళం నెలకొని, సభ కార్యక్రమాలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది.చైర్మన్ పోడియం వద్దకు మంత్రులు పేర్నినాని, కొడాలి నాని, ఇతర మంత్రులు వచ్చి నినాదాలు చేస్తున్నారు.