వంద కోట్ల హీరోను చిన్న హీరో అనేశాడేంటి బాసూ..!

Sun Jan 29 2023 18:48:42 GMT+0530 (India Standard Time)

Chiranjeevi In Waltair Veerayya Success Meet

మెగాస్టార్ చిరంజీవి మొన్న సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ వేడుక ను వరంగల్ లో భారీ ఎత్తున నిర్వహించారు. చిరంజీవి తో పాటు ఆ సక్సెస్ వేడుకలో రామ్ చరణ్ సందడి చేశారు. రామ్ చరణ్ మాట్లాడుతూ చిరంజీవి సౌమ్యుడు కావచ్చు కానీ ఆయన కుటుంబ సభ్యులమైన మేము మరియు ఆయన అభిమానులు సౌమ్యులు కారు అన్నట్లుగా చిరంజీవిపై విమర్శలు చేసే వారిని హెచ్చరించాడు.అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. సినిమాలో తాను రవితేజ వాల్ పోస్టర్ ని తన లుంగితో తుడిచి ముద్దు పెట్టిన సన్నివేశం గురించి వివరించాడు. ఆ సందర్భంగా రవితేజను చిన్న హీరో అంటూ చిరంజీవి ప్రస్తావించడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో యాంటీ మెగా ఫ్యాన్స్ స్పందిస్తూ రవితేజ చిన్న హీరో ఎలా అవుతారు అంటూ చిరంజీవిని ప్రశ్నిస్తున్నారు. ఆ రవితేజ ఉండడం వల్లనే వాల్తేరు వీరయ్య సినిమా ఇప్పుడు భారీ విజయాన్ని సొంతం చేసుకుందని... ఆయన లేకుంటే కచ్చితంగా ఈ స్థాయి విజయం వాల్తేరు వీరయ్య కు సొంతం అయ్యేది కాదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

రవితేజ గత చిత్రం ధమాకా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసిన విషయం తెలియదా... అంతకు ముందు కూడా రవితేజ నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుని దాదాపు 100 కోట్ల కలెక్షన్స్ అని సొంతం చేసుకున్నాడు కదా ఎందుకు రవితేజ మీకు చిన్న హీరో అనిపించాడు అంటూ చిరంజీవిని ప్రశ్నిస్తున్నారు.

రవితేజ ని ఎలా చిన్న హీరో అంటావు అంటూ మెగాస్టార్ చిరంజీవిని సోషల్ మీడియాలో ఒక వర్గం వారు టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ సమయంలో చిరంజీవికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ విషయంలో చిరంజీవి ఎలా స్పందిస్తాడు అలాగే రవితేజ ఈ విషయం గురించి ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.