Begin typing your search above and press return to search.

ఆఫీసుకని వచ్చి టాయిలెట్ లో గడిపేస్తే...!?

By:  Tupaki Desk   |   2 Jun 2023 8:00 PM GMT
ఆఫీసుకని వచ్చి టాయిలెట్ లో గడిపేస్తే...!?
X
ఆఫీసుల్లో పని గంటలు ఎన్ని ఉంటాయి? కాస్త అటు ఇటుగా సాధారణంగా 8 గంటలు ఉంటాయి. వాటిలో మహా అయితే 30 నిమిషాలు లంచ్ / డిన్నర్ బ్రేక్ ఉంటుంది. అంటే సుమారు ఏడున్నర గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఆ ఏడున్నర గంటల్లో ఆరుగంటలు వాష్ రూం లో గడిపేస్తే ఎలా ఉంటుంది? ఏముంది జాబ్ నుంచి తీసిపారేస్తారు? అలా అన్నేసి గంటలు రెస్ట్ రూం లో గడిపడానికి హెల్త్ ప్రోబ్లం ఉందని ప్రూఫ్స్ చూపించి కోర్టుకి వెళ్తే...!?

చైనా లో వాంగ్‌ అనే వ్యక్తిని 2015లో కంపెనీ ఉద్యోగంలో నుంచి తీసేసింది. దీనిపై సదరు ఉద్యోగి కోర్టును ఆశ్రయించాడు. తన ఉద్యోగాన్ని తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు.

తనకు ఉన్న అనారోగ్య సమస్యను పరిగణనలోకి తీసుకోవాలని విన్నవించాడు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఇప్పుడు ఈ తీర్పు చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై కొంతమంది సెటైరికల్ గా కూడా స్పందిస్తున్నారు.

ఇంతకూ విషయం ఏమిటంటే… డ్యూటీ టైమింగ్స్ లో దాదాపు ఆరు గంటలు టాయిలెట్లో‌నే ఉంటున్నాడట వాంగ్. అదే ఆయనకున్న అనారోగ్య సమస్య. అవును... వాంగ్‌ 2015లో మలద్వార సమస్యతో బాధపడ్డాడు. దీనికి చికిత్స కూడా తీసుకున్నాడు. కానీ, సమస్య పూర్తిగా నయం కాలేదు.

దీంతో.. అప్పటి నుంచి గంటలు తరబడి టాయిలెట్లో‌ గడపడం మొదలుపెట్టాడు. దీంతో… వెళ్లిన ప్రతిసారి గంటనుంచి మూడు గంటల వరకు టాయిలెట్లో‌నే ఉండడం కంపెనీ గమనించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన సాక్ష్యాలు కూడా కోర్టుకు సమరిపించింది. ఫలితంగా అతడిని ఉద్యోగం నుంచి తీసిపారేసింది.

అయితే కంపెనీ ఇచ్చిన కారణాలతోనూ, సంస్థ ఇచ్చిన సాక్షాధారాలతోనూ కోర్టు ఏకీభవించింది. అతడిని ఉద్యోగంలో నుంచి తీసిపారేయడం సరైన చర్యే అని తీర్పునిచ్చింది. అయితే... ఇతడి ఆరోగ్య సమస్య గురించి తెలుసుకున్న నెటిజన్లు... అయ్యో పాపం అంటూ విచారం వ్యక్తం చేస్తుండగా... " కోర్టు గనక అతడిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశించి ఉంటే.. కంపెనీల్లో టాయిలెట్లు హౌస్ ఫుల్ గా ఉండేవి" అంటు కొందరు కామెంట్లు పెడుతున్నారు!