భారత్ ఆక్వా రంగం పై చైనా కుట్ర... ఏం చేస్తుందంటే ?

Wed Jul 21 2021 19:00:01 GMT+0530 (IST)

China conspiracy against India aqua sector

భారత్ లో ఆక్వా రంగాన్ని దెబ్బతీయాలని చైనా కుట్ర పన్నుతోంది. భారత్ నుంచి చైనా కు ఎగుమతి అయ్యే ష్రింప్ ప్యాకింగ్ పై కరోనా వైరస్ అవశేషాలు ఉన్నాయంటూ లేని పోని సాకులు చెప్తుంది. కరోనా వైరస్ ను కారణంగా చూపుతూ చైనా వారానికి ఐదు నుంచి ఏడు ఆక్వా కంపెనీలను డీలిస్టింగ్ చేస్తోంది. దీనితో పాటుగా వర్చువల్ ఆడిట్ పేరుతో కంపెనీలపై నిషేధం విదిస్తుంది. ఆక్వా ఇండియా ఎకానమీపై చైనా అధ్యక్షుడు జిన్ పిన్ కుతంత్రం చేస్తున్నాడు.చైనా ఊహించని  నిర్ణయంతో పలు రాష్ట్రాలు ఏపీలోని ష్రింప్ ఎగుమతిదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారంపై సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ కేంద్రం జోక్యం చేసుకోవాలని ఎగుమతి దారులు కోరుతున్నారు. ఏపీలోని భీమవరం కేంద్రంగా భారీగా ష్రింప్ ఎక్స్‌పోర్ట్ కంపెనీలు యాంటీ వైరస్ టెస్టులు చేసినా చైనా వెనక్కి పంపుతోందటూ వ్యాపారులు వెల్లడించారు.

భారత్ నుంచి ప్రతి ఏడాది 30 నుంచి 40 వేల కోట్ల అక్వా ఉత్పత్తులు ఆమెరికా చైనా యూరప్ దేశాలకు ఎగుమతి అవుతున్న విషయం తెలిసిందే. చైనా 58 కంపెనీలు సస్పెండ్ చేయగా 16  కంపెనీలు డీలిస్టింగ్ చేసింది. భారత్ కు చెందిన రూ. 1200 కోట్ల దిగుమతులు1000 కంటైనర్లు చైనా పోర్టుల్లో నిలిచిపోయాయి.

ఆక్వా దిగుమతులపై చైనా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. ఫలితంగా జిల్లాలో రొయ్యలు సాగు చేసే రైతులు ఆర్థిక ఇబ్బందులపాలవుతున్నారని ఆయన వెల్లడించారు. ఇలాంటి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ఏపీ తీర ప్రాంతాలలో రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు.

ఇలా ఉండగా ఆక్వా పరిశ్రమతోపాటు ఆంధ్రప్రదేశ్ లోని మత్స్యకారులకు అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో కూడిన బృహత్తర ప్రాజెక్టుకు ఏపీ సర్కారు ఇప్పటికే శ్రీకారం చుట్టింది. తొలిదశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ గుంటూరు జిల్లా నిజాంపట్నం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నాలుగు ఫిషింగ్ హార్బర్లకు సీఎం వైఎస్ జగన్ గతేడాది శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం వాటి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

అంతేకాక రాష్ట్రంలో 25 ఆక్వాహబ్‌ల నిర్మాణ పనులు గతేడాది నవంబర్ నుంచి షురూ అయ్యాయి. వీటితో పాటు నియోజకవర్గానికో ఆక్వాహబ్ నిర్మాణం జనతా బజార్లలో నాణ్యమైన రొయ్యలు చేపలను అందుబాటులోకి తెచ్చేందుకు జగన్ సర్కాకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిషరీస్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కూడా ఏపీ సర్కారు ఇప్పటికే ఆర్డినెన్స్ తెచ్చింది.