Begin typing your search above and press return to search.

40 ఏళ్ల అమెరికా ఆధిపత్యాన్ని కూలదోసిన చైనా

By:  Tupaki Desk   |   9 April 2020 2:30 AM GMT
40 ఏళ్ల అమెరికా ఆధిపత్యాన్ని కూలదోసిన చైనా
X
ఇది కరోనా వ్యవహారం కాదు. ప్రపంచంలో పెక్కుమందికి తెలియకుండా జరిగిపోయే మేధో హక్కుల వ్యవహారం. మనకు తెలియకుండా ఎవడో మనం కొనే కొన్నింటిలో అప్పనంగా డబ్బులు దొబ్బే వ్యవహారం. సింపుల్ గా చెప్పాలంటే... కొన్ని దశాబ్దాల క్రితం... కేవలం 50 లక్షలకు కేంద్రం కొనగలిగిన బీటీ పత్తి పేటెంట్ కేంద్రం కొనకపోవడం వల్ల ప్రతి సంవత్సరం వేల కోట్లు ఇండియా నుంచి తరలిపోతున్నాయి. ఇలాంటి ఎన్నో అవకాశాలు ఇండియా మిస్సయ్యింది.

ఇక పోతే పేటెంట్ రైట్స్ సాధించే నెంబర్ గేమ్ లో గత 40 సంవత్సరాలుగా అమెరికా నెం.1 గా ఉంటూ వస్తోంది. కానీ కొన్ని దశాబ్దాలుగా దీని మీద కన్నేస్తూ వచ్చిన చైనా... చివరకు అమెరికా మీద పై చేయి సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక పేటెంట్లు కలిగిన దేశంగా ఇపుడు చైనా అవతరించింది. అంతర్జాతీయ పేటెంట్ రైట్స్ ఒప్పందాన్ని సమర్థంగా వినియోగించుకున్న చైనా పరిశోధనల మీద 312 బిలియన్ డాలర్లు ఖర్చుచేసింది. ప్రతి సంవత్సరం దానిని 10 శాతానికి పైగా పెంచుతూ వస్తోంది. దీంతో అత్యధిక పేటెంట్లు దక్కించుకునే స్థాయికి చైనా 2019 నాటికి చేరుకుంది.

ప్రస్తుతం పేటెంట్ రైట్స్ కోసం చైనా 58990 దరఖాస్తులు పెట్టుకుని మొదటి స్థానంలో నిలవగా... అమెరికా 57840 దరఖాస్తులతో రెండో స్థానంలో నిలిచింది. 52 వేలతో జపాన్ మూడో స్థానంలో ఉంది. ఇండియా టాప్ 10లో కూడా లేకపోవడం గమనార్హం. టాప్ టెన్ లో లేకపోయినా ఏ 10 వేల దరఖాస్తులు అయినా పెట్టిందనుకుని భ్రమపడుతున్నారేమో... టాప్ 10లో చివర్న ఉన్న నెదర్లాండ్స్ పెట్టిన దరఖాస్తుల సంఖ్యే 4011. ఇక అపుడు ఇండియా ఎన్ని పెట్టి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇండియాలో టాలెంట్ లేక కాదు... ఈ విషయం ప్రభుత్వం తగినంత శ్రద్ధ కనబరచకపోవడం వల్ల ఈ పరిస్థితి. ఏది ఏమైనా... చైనా ప్రతి విషయంలోను అగ్రరాజ్యంగా నిలవడానికి వచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు.