Begin typing your search above and press return to search.

అమెరికా కి చైనా గట్టి వార్నింగ్ ..ఇదే కారణం !

By:  Tupaki Desk   |   4 Aug 2020 11:30 PM GMT
అమెరికా కి చైనా గట్టి  వార్నింగ్ ..ఇదే కారణం !
X
చైనాకి చెందిన టిక్ టాక్ యాప్ అతి తక్కువ సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే గాల్వానా లోయ వద్ద జరిగిన సంఘటన తరువాత భారత ప్రభుత్వం చైనాకి చెందిన దాదాపుగా మొత్తం 100 యాప్స్ కి పైగా బ్యాన్ చేసింది. ఇదే దారిలో అమెరికా కూడా పయనిస్తుంది. కానీ , అమెరికా ఏకంగా టిక్ టాక్ ను సొంతం చేసుకోవాలని ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో చైనా , అమెరికా మధ్య టిక్ టాక్ రచ్చ మొదలైంది. టిక్ టాక్ ను సొంతం చేసుకోవాలని చూస్తున్న అమెరికా పై చైనా మండిపడుతుంది.

టిక్ టాక్ యాప్ ను సొంతం చేసుకోవడానికి అమెరికా యత్నిస్తోందని, దీన్ని అంగీకరించబోమని , దీన్ని అమ్మడానికి ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ఆలోచనను కూడా ప్రతిఘటిస్తామని చైనా అనుకూల డైలీ గ్లోబల్ టైమ్స్ తెలిపింది. మా టెక్నాలజీ కంపెనీ లను చేజిక్కించు కోవడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. కానీ దీన్ని సాగనివ్వం.. ఎదుర్కొని తీరుతాం అని చైనా తెలిపింది. అమెరికాలోని టిక్ టాక్ ఆపరేషన్స్ ని తాము కొనుగోలు చేస్తామని మైక్రోసాఫ్ట్ ఇటీవల ప్రకటించింది.. ఈ యాప్ కు సంబంధించిన కొన్ని కార్యకలాపాలను తాము డబ్బు పెట్టి కొంటామని, ఇందుకోసం దీని మాతృక సంస్థ బైట్ డాన్స్ తో చర్చలు జరుపుతున్నామని కూడా ఈ సంస్థ తెలిపింది.

భారత్ లో టిక్ టాక్ బ్యాన్ చేసిన తరువాత , అమెరికా లో టిక్ టాక్ ని బ్యాన్ చేస్తామని ప్రకటించి..ఆ తరువాత వెనక్కి తగ్గి దీనికి 45 రోజుల గడువు ఇచ్చాడు. తమ దేశానికి చెందిన ఏదైనా కంపెనీకి టిక్ టాక్ ని సెప్టెంబర్ 15 నాటికి విక్రయించాలని స్పష్టం చేశారు. మా దేశ యూజర్ డేటాను చైనా ప్రభుత్వానికి చేరవేసే చైనీస్ సంస్థలపై చర్య తీసుకుంటామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో చైనా అమెరికాకి గట్టి వార్నింగ్ ఇచ్చింది.