అంతరిక్షంలో మిర్చి పంట .. నాసా మరో ప్రయోగానికి శ్రీకారం !

Tue Jul 20 2021 15:21:21 GMT+0530 (IST)

Chili crop in space .. NASA launches another experiment!

ఆకాశం..అంతరిక్షయానం..పై గత కొన్నేళ్లుగా ప్రపంచంలోని పలు దేశాల శాస్త్రవేత్తలు  పరిశోధనలు-ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి అంతరిక్ష ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆకాశం అనేది అనంతం కాబట్టి ఆకాశం గురించి ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. ఎన్ని ప్రయోగాలు చేసినా విశ్వం గురించి పూర్తిగా తెలుసుకోవడం అనేది అసాధ్యం. అయితే ఆకాశంలో ఉండే కొన్ని అద్భుతాల గురించి వాటి వెనుక ఉన్న రహస్యాల గురించి అక్కడి వాతావరణం గురించి తెలుసుకునే ప్రయోగాలు మాత్రం సజావుగానే సాగుతున్నాయి.



ఇలాంటి సమయంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో కీలక అడుగు ముందుకు వేసింది. స్పేస్ వాతావరణంలో మిరకాయల్ని పండించే ప్రయత్నంలో సగం విజయం సాధించింది. 15000 వేలకోట్ల అమెరికన్ డాలర్ల ఖర్చుతో ఐదు దేశాల స్పేస్ ఏజెన్సీలు కలిసి ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో మిరపకాయలని పండిస్తోంది నాసా. మెక్సికన్ రకానికి చెందిన మేలైన హట్చ్ రకపు మిరప గింజలు ఈ జూన్‌లో స్పేస్ ఎక్స్ కమర్షియల్ సర్వీస్ ద్వారా స్పేస్ స్టేషన్ కు చేరుకున్నాయి. నాసా ఆస్ట్రోనాట్ షేన్ కిమ్ బ్రాగ్ ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్నాడు.

కిచెన్ ఓవెన్ సైజులో ఉండే సైన్స్ క్యారియర్ అనే డివైజ్‌లో వీటిని పండిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇవి పూర్తిస్థాయిలో ఎదగడానికి నాలుగు నెలలలోపు టైం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక నాసా దీన్నొక సుదీర్ఘమైన సంక్లిష్టమైన పరిశోధనగా చెప్పుకుంటుంది. వ్యోమగాములకు ఆహార కొరత తీర్చే చర్యల్లో భాగంగానే ఈ ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో ఇదే రీతిలో పూలు దుంపల కోసం ప్రయత్నించారు కూడా. అయితే జీరోగ్రావిటీ ల్యాబ్ లో మిరపకాయల్ని పండించడం వీలుకాదని సైంటిస్టులు నాసాతో ఛాలెంజ్ చేశారు. ఈ తరుణంలో ఛాలెంజింగ్‌గా తీసుకున్న నాసా సత్పలితాన్ని రాబట్టింది. సాధారణంగా స్పేస్ ప్రయాణంలో వ్యోమగాములు వాసన రుచి సామర్థ్యం కోల్పోతారు. ఆ టైంలో వాళ్లు స్పైసీ ఫుడ్‌కు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ తరుణంలో ఈ ప్రయోగం ఫలితానిచ్చేదేనని నాసా అభిప్రాయపడుతోంది.