Begin typing your search above and press return to search.

ముందస్తు బాటలో జగన్ : పీఠం పక్కాగా దక్కేనా...?

By:  Tupaki Desk   |   3 Jun 2023 8:00 AM GMT
ముందస్తు బాటలో జగన్ : పీఠం పక్కాగా దక్కేనా...?
X
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ముందస్తు ఎన్నికల వ్యూహం జగన్ కి ఎంత వరకూ కలసివస్తుందన్నది ఇపుడు చర్చనీయాంశంగా ఉంది. ముందస్తు అంటే డిసెంబర్ లో ఎన్నికలు అన్న మాట. ఇక షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు అంటే 2024 ఏప్రిల్ లో జరుగుతాయి. అంటే జస్ట్ నాలుగు నెలలు మాత్రమే తేడా. కేవలం ఈ నాలుగు నెలలూ ఏపీ రాజకీయాల్లో భారీ తేడాను తెస్తాయా, జగన్ కి పక్కాగా అధికారాన్ని అప్పగిస్తాయా అంటే చాలానే ఇందులో ఇమిడి ఉన్నాయని అంటున్నారు.

ముందుగా తీసుకుంటే ఈ ఏడాదే ఎన్నికలు అంటే ఆర్ధికంగా వైసీపీ ప్రభుత్వానికి అతి పెద్ద ఉపశమనం కలుగుతుంది. కేంద్రం నుంచి ఈ మధ్యనే రెవిన్యూ లోటు కింద నిధులు పదివేల కోట్లు రాబట్టారు. అప్పులు అన్ని రకాలుగా చేశారు. ఇక కొత్తగా పుట్టాలన్నా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. బీజేపీ పెద్దల వైఖరి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. సో రిస్క్ చేసి షెడ్యూల్ ఎన్నికల దాకా లాగిస్తే నష్టమే ఆ విధంగా అని ఒక అంచనా ఉంది.

మరో వైపు రాజకీయంగా చూస్తే టీడీపీ జనసేన ప్లస్ బీజేపీ అంటున్నారు. ఈ మూడు పార్టీలు కలిస్తే 2024 లో ఎన్నికలు జరిగితే సెంటియెంట్ ప్రకారం దెబ్బ అవుతుంది అని అంటున్నారు. అందుకే 2014లో ఉన్న ఆ చివరి నాలుగు నంబర్ ఏడాది రాకుండా ఎన్నికలు కానిచ్చేస్తే ప్లస్ అవుతుందని సెంటిమెంట్ పరంగా ఊహిస్తున్నారు. ఇక సీట్ల పంపకం విషయం లో పొత్తుల విషయంలో టీడీపీ జనసేనల మధ్య తేలాల్సినవి చాలా ఉన్నాయి.

నాకు సీఎం పదవి వద్దు అని పవన్ అన్నా ఒక బలమైన సామాజికవర్గం అంత తేలికగా ప్రస్తుతానికి తీసుకోవడంలేదు అదే 2024 ఏప్రిల్ అంటే వారిని కన్విన్స్ చేయవచ్చు అన్న డౌట్లు వైసీపీలో ఎక్కడో ఉన్నాయి. ఇక బీజేపీని ముఖ్యంగా ఈ కూటమిలో చేరనీయకుడదు అంటే బీజేపీ ఫోకస్ వేరే చోట ఉండాలి. అదే తెలంగాణా. అందుకే తెలంగాణా ఎన్నికలతో పాటే ఏపీని అని జగన్ గట్టిగా అంటున్నారు అని తెలుస్తోంది.

నిజానికి ఈ వ్యూహం కరెక్టే అని అంటున్నారు. వ్యతిరేకత జనంలో వైసీపీ మీద ఉంది అన్నది అందరికీ తెలుసు. వైసీపీ పెద్దలలూ తెలుసు. ఆ వ్యతిరేకతను కన్సాల్డేట్ చేసే విధంగా విపక్షాలు ఇంకా సమర రంగంలో దూకలేదు. పైగా జనాలలో ఇప్పటికీ విపక్షం ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అయితే సాధించలేకపోయాయి. కానీ కాలం గడిచే కొద్దే జనాలలో ఒపీనియన్ బలంగా మారుతుంది.

అపుడు అదే విపక్షానికి అడ్వాంటేజ్ అవుతుంది. నిజానికి ఇంకా ఎన్నికలు ఏడాది కాబట్టి అపుడు చూద్దామన్న భావనలో జనం ఉండగానే డిసెంబర్ అంటే వారికి ఆలోచించుకునే టైం లేకుండా ఓట్లుఇ తమకు అనుకూలంగా రాబట్టే ఎత్తుగడ ఇది. సో ఇది సక్సెస్ అవుతుంది అన్నదే వైసీపీ పెద్దలలో ఉంది.

లోకేష్ పాదయాత్ర ఈ డిసెంబర్ నాటికి గోదావరి జిల్లాల దాకా కూడా రాదు, ఇక బాబు జిల్లాల టూర్లు ఎన్ని చేసినా టీడీపీ పట్ల అనుకూలత కావాల్సినంత తేలేకపోతున్నారు. ఈ సంకట పరిస్థితినే వైసీపీ అడ్వాంటేజ్ గా తీసుకోవాలనుకుంటోంది అంటున్నారు. అన్నింటికీ మించి సంక్షేమ పధకాలు ఏ ఒక్క రోజూ ఆపలేదు అన్న రికార్డు ఈ రోజుకి వైసీపీకి ఉంది. వచ్చే ఏడాది దాకా వేచి చూస్తే అది సాధ్యపడకపోవచ్చు. ఈ బ్రహ్మాస్త్రాన్ని వాడుకోవాలీ అంటే డిసెంబర్ ఎన్నికలు బెస్ట్ అని ఆలోచిస్తున్నారు.

ఇక డిసెంబర్ అంటే చలి కాలం, వాతావరణం కూడా అనుకూలిస్తుంది. ప్రజలకు సమస్యలు కూడా పెద్దగా ఉండవు కాబట్టి వారు కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతారు అని లెక్క వేస్తున్నారు. సో పక్కాగా పీఠం దక్కుతుంది అన్నదే వైసీపీ పెద్దల ప్లాన్ గా ఉంది మరి. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ముందస్తు మళ్లీ సీఎం గా జగన్ని ఉంచుతుందో లేదో అన్నది జనాల చేతుల్లోనే ఉంది.