ఫోన్ పే.. గూగుల్ పే.. వడ్డనపై క్లారిటీ ఇదే!

Wed Mar 29 2023 16:19:43 GMT+0530 (India Standard Time)

Charges For Usage of UPI Payments

సాధారణంగా..ఇప్పుడు చేతిలో సెల్ఫోన్ వచ్చిన తర్వాత.. డబ్బుల చెల్లింపు బదిలీ వ్యవహారం.. సెకన్ల వ్యవధిలోనే పూర్తవుతోంది. దీనికి ఫోన్ పే గూగుల్ పే వంటి యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటికి మనం అలవాటు కూడా పడిపోయాం. అయితే.. ఇప్పుడు వీటి వినియోగానికి రుసుములు వసూలు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో ఎవరెవరికి చార్జీలు వర్తిస్తాయి..? ఎంతెంత పడతాయి?  వంటివి ఆసక్తిగా మారాయి.



యూపీఐ ఆధారంగా పని చేసే గూగుల్ పే పేటీఎం లావాదేవీలపై సర్ఛార్జ్ విషయమై జాతీయ చెల్లింపుల సంస్థ తాజాగా మరింత స్పష్టత ఇచ్చింది. ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా చేసే మర్చంట్ ట్రాన్సాక్షన్స్కు మాత్రమే రుసుము వసూలు విధానం వర్తిస్తుందని తెలిపింది. సాధారణ వినియోగదా రులపై ఎలాంటి అదనపు భారం ఉండదని తేల్చిచెప్పింది.

గూగుల్ పే పేటీఎం వంటి యూపీఐ యాప్స్ ద్వారా రూ.2000కు మించి చేసే మర్చంట్ లావాదేవీలపై సర్ఛార్జ్ చెల్లించాలన్న వార్తలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

యూపీఐ వినియోగదారులు అందరిపై ఈ అదనపు భారం పడుతుందని అందరూ ఆందోళన చెందగా.. అలాంటిదేమీ లేదని భారత జాతీయ చెల్లింపుల సంస్థ- ఎన్పీసీఐ తెలిపింది.

అంతకుముందు.. యూనిఫైడ్ ఫేమెంట్స్ ఇంటర్ఫేస్-యూపీఐ ద్వారా చేసే మర్చంట్ లావాదేవీలపై ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్- పీపీఐ ఫీజు వసూలు చేయనున్నట్లు ఎన్పీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. యూపీఐ ద్వారా రూ.2000కన్నా ఎక్కువ మొత్తం బదిలీ చేస్తే.. లావాదేవీ విలువలో 1.1శాతం సుంకం విధించనున్నట్లు తెలిపింది.

సెప్టెంబర్ 30 నాటికి ఈ ఛార్జీపై సమీక్షిస్తామని చెప్పింది. ట్రాన్సాక్షన్ ఆమోదించడం ప్రాసెస్ చేయడం పూర్తి చేయడానికి సంబంధించిన ఖర్చుల దృష్ట్యా ఈ సర్ఛార్జ్ విధిస్తున్నట్లు జాతీయ చెల్లింపుల సంస్థ- ఎన్పీసీఐ స్పష్టం చేసింది. కొత్త నిబంధనలు ఏప్రిల్ 1న అమల్లోకి వస్తాయని తెలిపింది.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.