చంద్రబాబు నాయుడు అలా చెప్పుకోవడమే అసలైన కామెడీ!

Tue Oct 22 2019 19:00:01 GMT+0530 (IST)

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన గురించి తను డబ్బా కొట్టుకోవడం ఆపడం లేదు. ప్రజలు చంద్రబాబు ను తిరస్కరించి ఎంతో ఎక్కువ కాలం కాలేదు. ఐదు నెలల  కిందట వచ్చిన ఫలితాల్లో చంద్రబాబు నాయుడు ను ప్రజలు పూర్తిగా తిరస్కరించారు.ఎంతలా అంటే టీడీపీని కేవలం ఇరవైమూడు సీట్లకు పరిమితం చేసేంతలా. ఆఖరికి చంద్రబాబు నాయుడి తనయుడిని ఎమ్మెల్యేగా ఓడించేంతలా! చంద్రబాబు నాయుడి మెజారిటీ కూడా కుప్పంలో చాలా తగ్గిపోయేంతలా ఆయనను - ఆయన పార్టీని ప్రజలు  తిరస్కరించారు.

ఇదంతా జరిగి ఐదు నెలలు అవుతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు అప్పుడే  మళ్లీ మొదలుపెట్టారు. 'ప్రజలు నేనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు..' అని చంద్రబాబు నాయుడు అప్పుడే  చెప్పుకు తిరుగుతున్నారు. ఐదు నెలల కిందట వచ్చిన ఎన్నికల ఫలితాలకూ - ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్న మాటలకూ ఏమైనా సంబంధం ఉందా? అనేది ఏ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నవారికైనా అర్థం  అవుతుంది.

అయితే జగన్ పై అప్పుడే తీవ్ర వ్యతిరేకత పెరిగిందనేది చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్న మాట. ఉన్నంతలో చంద్రబాబు  కంటే చాలా మెరుగ్గా పాలిస్తున్నాడు వైఎస్ జగన్. హంగులూ - అర్బాటాలు - ప్రచారాలు - సింగపూర్ టూర్లు - చైనా కబుర్లు - గ్రాఫిక్స్ లేకుండా వాస్తవికంగా జగన్ పాలన సాగుతూ ఉంది. అయితే  చంద్రబాబు నాయుడు మాత్రం సహించలేకపోతున్నారు.

అలా కామ్ గా ఉండలేకపోగా.. అప్పుడే ప్రజలు తనను  ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. మరి ప్రజల సంగతేమో కానీ - తెలుగుదేశంలో అయినా ఆ భావన ఉందా? నేతలు ఎందుకు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడిపోతున్నారో ఆయన ఆలోచించు కోవాలని పరిశీలకులు అంటున్నారు.