జగన్ కి భారీ షాక్ ఇచ్చేలా బాబు మాస్టర్ ప్లాన్...?

Thu Nov 25 2021 06:00:01 GMT+0530 (IST)

Chandrababu master plan to give shock to Jagan

చంద్రబాబు అంటేనే రాజకీయ గండర గండడు అని చెబుతారు. ఆయన ఆలోచనలు వ్యూహాలను మ్యాచ్ చేసే వారు దరిదాపుల్లో ఎవరూ ఉండరని కూడా అంటారు. బాబు ఏడుపు వెనక కూడా పక్కా ప్లానింగ్ ఉందని అనుమానిస్తున్నారు అంటే అదే బాబు అంటే.అలాంటి బాబు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసి మీటింగులు పెట్టుకుంటూ మిగిలిన టైమ్ గడుపుతూ ఉంటారనుకుంటే పొరపాటే. జగన్ సర్కార్ ని రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ కూడా చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. చంద్రబాబు ఇపుడు వరద బాధితులను పరామర్శిస్తున్నారు. ఆ తరువాత ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలవుతుంది అంటున్నారు.

చంద్రబాబు తన రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మీడియా ఎదుట కంట కన్నీరు పెట్టారు. ఒక విధంగా అది జాతీయ స్థాయి అంశమైంది. అంతే కాదు జనాలలో కూడా పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. చంద్రబాబు ఇపుడు ఆ సానుభూతిని ఒక అస్త్రంగా చేసుకుని ఒక ప్రయోగం చేయనున్నారుట.

కుప్పం ఎమ్మెల్యే సీటుకు ఆయన రాజీనామా చేసి ఉప ఎన్నికలను అర్జంటుగా తీసుకువస్తారని అంటున్నారు. కుప్పం కోటను బద్ధలు కొట్టాం బాబు పని అయిపోయింది అని వైసీపీ ఒక లెక్కన ప్రచారం చేస్తోంది.

కుప్పంలో పంచాయతీల నుంచి మునిసిపాలిటీ దాకా అన్నీ కూడా వైసీపీ పరం అయ్యాయని గొప్పగా చెప్పుకుంటోంది. డప్పు కొట్టుకుంటోంది. మరి బాబుకు కుప్పం సెంటిమెంట్ ఉండదా. తాను మూడున్నర దశాబ్దాలుగా ఏలిన కోట కూల్చేస్తామని వైసీపీ నేతలు అంటే ఆయన హర్ట్ అవరా.

అందుకే బాబు టైమ్ చూసి మరీ జగన్ కి భారీ షాక్ ఇవ్వబోతున్నారు అంటున్నారు. కుప్పంలో టీడీపీ బలం చెక్కుచెదరలేదని తనకు కూడా తరగని జనాదరణ ఉందని బాబు రుజువు చేయబోతున్నారుట. అందుకే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయన ఉప ఎన్నికలకు వెళ్తారట.

కుప్పంలో వీధి వీధి తిరిగి మరీ తనకు వైసీపీ సర్కార్ అసెంబ్లీలో చేసిన దారుణ అవమానాన్ని జనాలకు చెబుతారు అంటున్నారు. ఆ విధంగా జనం మెప్పు పొందుతారని అంటున్నారు.

ఈ దెబ్బకు కుప్పంలో సీన్ మొత్తం తిరగబడుతుందని టీడీపీకి రెట్టించిన మద్దతు దక్కుతుందని బాబు లెక్కలు వేస్తున్నారుట. కుప్పంలో చంద్రబాబు గెలవడంతోనే ఏపీలో వైసీపీకి గట్టి చాలెంజి చేస్తారని వైసీపీ పని అయిపోయిందని కూడా చాటింపు వేస్తారని చెబుతున్నారు.

మొత్తానికి తన కన్నీటితో ఏపీలోని వైసీపీ సర్కార్ కి నీళ్ళు తేవాలని బాబు వేస్తున్న ఎత్తులను వైసీపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. మరి చంద్రబాబుకు ఏపీవ్యాప్తంగా ఇపుడు సానుభూతి వచ్చింది. ఆయన సొంత సీటు కుప్పంలో కూడా అది కాస్తా ఎక్కువే ఉంటుంది. మరి బాబు కనుక రాజీనామా చేస్తే కుప్పంలో టీడీపీ విజయం ఖాయమేనా. జనాలు ఎలా రియాక్ట్ అవుతారు. ఇవన్నీ జరగాలంటే వేచి చూడాల్సిందే.