బాబుతో అహ్మద్ పటేల్ అక్రమ డొంక కదిలినట్లేనా?

Thu Feb 20 2020 10:06:28 GMT+0530 (IST)

Chandrababu funds: Notices to Ahmed Patel

సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్న వైనం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్న వైనాన్ని ఇరు పార్టీలు గుర్తించకున్నా.. ప్రజలకు మాత్రం నచ్చక రిజెక్టు చేశారు. ఉప్పు నిప్పు లాంటి రెండు పార్టీల మధ్య పొత్తు అనుబంధం వెనుకున్న కొత్త లెక్కలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఐటీ శాఖ జరిపిన తనిఖీల్లో సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి.బాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లలో వెల్లడైన అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడైన అహ్మద్ పటేల్ కు రూ.400 కోట్లకు పైనే నల్లధనాన్ని హవాలా మార్గంలో తరలించిన కొత్త విషయాన్ని ఐటీ శాఖ గుర్తించినట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించి ఇప్పటికే అహ్మద్ పటేల్ కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది.వాస్తవానికి ఆయన ఈ నెల 14న విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ.. హాజరు కాలేదు. తన ఆరోగ్యం బాగోలేదని.. ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నట్లుగా చెప్పిన ఆయన.. విచారణకు డుమ్మా హాజరు కాలేదు.

దీంతో.. మరోసారి రావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీకి అవసరమైన ధనసాయాన్ని చంద్రబాబు చేసినట్లుగా భావిస్తున్నారు. దగ్గర దగ్గర రూ.400 కోట్ల మేర కాంగ్రెస్ కు బాబు సమకూర్చినట్లుగా భావిస్తున్నారు. ఈ ఆరోపణలకు తగ్గట్లే.. బాబు పీఏ శ్రీనివాస్ దగ్గర లభ్యమైన పత్రాల్లో అహ్మద్ పటేల్ పేరును గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇరిగేషన్ ప్రాజెక్టు ఇంజనీర్ సమకూర్చిన నిధులతోనే కాంగ్రెస్ కు సమకూర్చినట్లుగా చెబుతున్నారు. బాబుకు దగ్గరగా ఉన్న మిగిలిన సన్నిహితుల నుంచి స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను పరిశీలిస్తే భారీ ఎత్తున బ్లాక్ మనీని వెలుగుచూసే వీలుందని చెబుతున్నారు. ఈ ఉదంతం రాజకీయ వర్గాల్లో సంచలనం గా మారింది.