Begin typing your search above and press return to search.

చంద్రబాబు అప్పుడు అంతే.. ఇప్పుడూ అంతే!!

By:  Tupaki Desk   |   12 Aug 2020 8:30 AM GMT
చంద్రబాబు అప్పుడు అంతే.. ఇప్పుడూ అంతే!!
X
దశాబ్దాల కరువు తీరనున్న నేపథ్యంలో చంద్రబాబు రూపంలో రాయలసీమ వెన్నుపోటుకు గురికాబోతోంది. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా సీమ రూపు రేఖలే మారతాయి. అది అందరికీ తెలిసిన నిజం. అది జరిగితే చంద్రబాబుకు రాజకీయ విరమణ తప్పదు. అందుకే రాయలసీమ ప్రయోజనాల కన్నా తన స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ... ఆ ప్రాజెక్ట్‌ను అడ్డుకులే వెన్నుపోటు రాజకీయానికి తెరతీశారు.

తాను అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు. ఇప్పుడు సీఎం జగన్‌ చేస్తుంటే తెలంగాణ నేతల వాదానికి అనుకూలంగా, సీమకు వ్యతిరేకంగా మాట్లాడుతూ కరువు సీమ జనం నోట్లో మరోసారి మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని పట్టించుకోలేదు. అందుకు పోలవరమే ఉదాహరణ. ఆయన చేసిన అభివృద్ధి ఎలాంటిదో ఎడారిగా మారిన సీమను చూస్తే అర్థమవుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నవారికి అడ్డం పడడమే ఆయన లక్ష్యం. అప్పుడు రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టినా, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి రాలయసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నా అడ్డంకులు సృష్టించడమే ఆయన గొప్పతనం.

* బాబు నోట వ్యతిరేకత పాట
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వంతో సహా రాజకీయ పార్టీలన్నీ ముఖ్తకంఠంతో ఒక్కటై దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతున్నాయి. ఏపిలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ లాంటివి ప్రభుత్వంపైనే ఎదురుదాడి చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఏ విధంగానైనా ప్రాజెక్ట్ ఆగిపోవాలనే ధోరణిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణలో అందరూ ఏకమైతే ఏపిలో ప్రభుత్వాన్ని అందరూ కలిసి ఒంటరిని చేశారు. ఇక పచ్చమీడియా అయితే చంద్రబాబు చెప్పిందే నిజం అని ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణలో ప్రభుత్వంతో సహా ప్రతిపక్ష పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి రాయలసీమ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఏపిలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. నారా బాబు రాష్ట్ర ప్రయోజనాలను పక్కకు నెట్టి సొంత ప్రయోజనాలకోసం పోరాడుతున్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేసే రాయలసీమ ప్రాజెక్ట్ పై చంద్రబాబు, తన అనుచరణగణం, అనుచర పార్టీలైన సి పీ ఐ, కాంగ్రెస్, బి జె పీ లోని కొందరు నేతలు పచ్చమీడియా సహాయంతో కుట్రలు పన్నుతున్నారు. రాయలసీమ ప్రాజెక్ట్ ను పరుగులు పెట్టిస్తే జగన్ కు మంచి పేరు వస్తుందనేది చంద్రబాబు భయం. ఇక్కడ కూడా రాజకీయంగా ఆలోచిస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి అస్సలు మాట్లాడడం లేదు.

* ఆనాడు కేసీఆర్‌ చాకచక్యం
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మించే సమయంలో పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పంద చర్చలు జరిపి అప్పటి వరకు ఉన్న సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయ్యింది లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.

ఆంధ్రప్రదేశ్ లో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. పొరుగున ఉన్న తెలంగాణ, ఒడిశా వంటి రాష్ట్రాలతో చర్చలు జరిపి సామరస్య పూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశమై సాగు నీరు మరియు ఇతర వివాదాలు పరిష్కరించుకునేందుకు సిద్ధం అయ్యారు. అయితే ఇది నచ్చని చంద్రబాబు, వారిద్దరూ స్నేహపూర్వకంగా ఉంటే తమకు రాజకీయంగా ఇబ్బంది అని భావించి రాష్ట్రానికి ప్రయాజనం చేకూర్చే పథకాలకు సృష్టించేందుకు సిద్ధమయ్యారు.

* సీమ ఎత్తిపోతలతో ఎన్నో ప్రయోజనాలు
రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ప్రయోజనం చేకూర్చాలని జగన్ మోహన రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సిద్ధమయ్యారు. ఆ పథకం ప్రస్తుతం టెండర్ల దశలో ఉంది. ఈ పథకంపై తెలంగాణ ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు ఒక్కటై ఆరోపణలు చేస్తుంటే ఏపిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రతిపక్ష తెలుగుదేశం, కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోగా ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి ఉత్తమ్, భట్టి, నాగం మాట్లాడడం ప్రారంభించారు. కాంగ్రెస్ ఒక్కటే మాట్లాడితే తమని ప్రజలు తప్పుగా భావిస్తారని బి జె పీ నేతలు కూడా గళం విప్పారు. ఇప్పుడు వారికి ఏ పీ నుంచి చంద్రబాబు జత కలిశారు. తెలంగాణా ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేని ప్రాజెక్ట్ ని చంద్రబాబు వివాదంలోకి లాగారు. ఈ పథకం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం అంటూనే మరో పక్క ఆ ప్రాజెక్ట్ కు గండి కొట్టేలా సిద్ధం అయ్యారు. తనతో పాటు తనకు వంతపాడే సి పీ ఐ, కాంగ్రెస్, బీజెపిలోని తన అనుకూల వర్గం నేతలను రంగంలోకి దించి ఈ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. ఎల్లో మీడియాను నమ్ముకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబు అండ్ కో రాయలసీమ ప్రాజెక్ట్ విషయంలో కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. ఎద్దు ఈనింది అంటే గాటన కట్టేయండి అన్నట్లుగా చంద్రబాబు మాటే వేదంగా నడుచుకునే పచ్చమీడియా, పార్టీలు, ఆయనకు వంతపాడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ పైన ప్రభుత్వ వైఖరి వల్ల నష్టం జరుగుతుందని కలర్ ఇచ్చేలా చంద్రబాబు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు .

ఏపి ప్రభుత్వం రాయయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి మే లో ఉత్తర్వులు జారీ చేసినా తెలంగాణ సి ఎం వారం రోజుల క్రితం వరకు నోరు మెదపలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు కూడా స్పందించలేదు. రాజకీయ ప్రయోజనాలతో ఇటు చంద్రబాబు అండ్ కో తెలంగాణాలో కాంగ్రెస్ లోని గ్రూపులు, బి జె పీ నేతలు ఇటు ఏ, పీ, అటు తెలంగాణ ప్రభుత్వాలపై విమర్శలు చేస్తుండటం స్పందించక తప్పని పరిస్థితి నెలకొనటం తో ఏ పీ చర్యలను అడ్డుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా చర్యలు చేపట్టిన జగన్ ను అభినందిచకపోయినా నష్టం కలిగించేలా వ్యహరించకుండా ఉండాల్సిన చంద్రబాబు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా తెలంగాణాలో తమ భావజాలాలు, అభిప్రాయాలు విభిన్నమైన అన్ని పార్టీలు ఏకం అయ్యాయి.