Begin typing your search above and press return to search.

బాబు తాజా ట్వీట్ కు కేంద్రమంత్రిని ట్యాగ్ చేశారెందుకు?

By:  Tupaki Desk   |   20 Nov 2019 10:45 AM GMT
బాబు తాజా ట్వీట్ కు కేంద్రమంత్రిని ట్యాగ్ చేశారెందుకు?
X
నిజానిజాల్ని పక్కన పెట్టేసి.. కొన్ని ఆధారాలంటూ హడావుడి చేసే టీడీపీ అధినేత చంద్రబాబు.. తాజాగా మరో తరహా ఎత్తుగడకు తెర తీశారు. జగన్ ప్రభుత్వాన్ని ఎంతలా ఇరుకున పెట్టాలో.. అంతలా ఇరుకున పెట్టేందుకు ఆయన వేస్తున్న ప్లాన్లు అంతా ఇంతా కాదు. తన మాటలతో.. చేతలతో ఏపీలోని జగన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయటం.. తన హయాంలో వెలిగిపోయిన ఏపీ.. ఇప్పుడు ఆరిపోయిందన్న భావన కలుగజేసేందుకు ఆయన పడుతున్న తపన అంతా ఇంతా కాదు.

తాజాగా చంద్రబాబు చేసిన ట్వీట్ దీనికి నిదర్శనంగా మారిందని చెప్పాలి. ఏపీ ప్రభుత్వంపై గ్లోబల్ కంపెనీలు కేసులు వేయనున్నాయంటూ ఈ రోజు కొన్ని ఇంగ్లిషు మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో.. వాటి క్లిప్పులను పట్టుకున్న చంద్రబాబు.. తాజాగా ఒక ట్వీట్ చేశారు.

ఆంగ్ల దినపత్రికల్లో వచ్చిన వార్తల కటింగ్స్ ను తన ట్వీట్లకు జత చేసిన ఆయన.. సదరు వార్తల్లోని సారాంశం ఏపీని అత్యంత ప్రమాదకర పరిస్థితి దిశగా తీసుకెళుతున్నట్లుగా ఆందోళన వ్యక్తం చేశారు. గ్లోబల్ కంపెనీలు ఏపీ ప్రభుత్వంపై కేసులు వేయాలని భావిస్తున్న వార్తల్ని చూస్తుంటే తనకు చాలా ఇబ్బందిగా ఉన్నట్లు పేర్కొన్న ఆయన.. వ్యూహాత్మకంగా తన ట్వీట్ ను కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ కు ట్యాగ్ చేయటం గమనార్హం. ఏపీలో ఏదో జరిగిపోతుందన్న భావన కలిగించేందుకు వీలుగా క్లిప్పింగుల్ని బాబు జత చేశారని చెప్పాలి.

ఇక.. విషయానికి వస్తే ఏపీలో పలు క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీనికి కారణం చంద్రబాబు హయాంలో ఒప్పందాలు కుదుర్చుకున్న ఈ కంపెనీలకు సంబంధించిన డీల్ నిబంధనలకు విరుద్ధంగా ఉండటమే కారణంగా చెబుతున్నారు. బిడ్డింగ్ లో చోటు చేసుకున్న అవకతవకల్ని చూపిస్తున్న ఏపీ ప్రభుత్వం వాటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే చంద్రబాబు ఆవేదన మరోలా ఉంది. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏపీ భవిష్యత్తు పెట్టుబడులకు విఘాతం కలిగేలా ఉందని.. ప్రభుత్వంపై పలు కంపెనీలు కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నట్లుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రభుత్వం తమ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్ని వెనక్కి వెళ్లాలన్న నిర్ణయాన్ని తీసుకోవు.

అలా తీసుకున్నదంటే.. దాని వెనుక జరిగిన లోటుపాట్లపై అవగాహన ఉంటే మాత్రమే చేస్తాయన్నది మర్చిపోకూడదు. కాకుంటే.. ఇటీవల కాలంలో జగన్ ప్రభుత్వం మీద గురి పెట్టినట్లుగా ఇంగ్లిషు మీడియాకు చెందిన సంస్థలు వ్యతిరేక కథనాల్ని రాస్తున్న వైనాన్ని మర్చిపోకూడదు. బాబు ట్వీట్ పై జగన్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.