Begin typing your search above and press return to search.

బీజేపీ విషయంలో బాబు మరో యూటర్న్ తీసుకోవాల్సిందేనా!

By:  Tupaki Desk   |   2 Dec 2019 2:30 PM GMT
బీజేపీ విషయంలో బాబు మరో యూటర్న్ తీసుకోవాల్సిందేనా!
X
ఇప్పటికైతే భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. లోక్ సభ, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కమలం పార్టీ విషయంలో ఎలా స్పందించారో ఇప్పుడేం చెప్పనక్కర్లేదు. మోడీ మీద ఒంటి కాలితో లేచారు చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు మోడీ విషయంలో చంద్రబాబు నాయుడు రూటు మారిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు బీజేపీ మీద ఒక రేంజ్ లో రెచ్చిపోయారు. వేరే రాష్ట్రాలకు వెళ్లి బీజేపీ వ్యతిరేక ప్రచారం చేశారు కూడా. ఇక మోడీ మీద వ్యక్తిగత విమర్శలకూ వెనుకాడలేదు. మోడీ భార్య పేరు ప్రస్తావించి మరీ విరుచుకుపడ్డారు చంద్రబాబు నాయుడు. ఇటీవల మాట్లాడుతూ.. తను మోడీ వ్యక్తిగత విషయాల మీద కామెంట్ చేయలేదన్నట్టుగా, వ్యక్తిగత వైరం లేదన్నట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అయితే చంద్రబాబు నాయుడి అవకాశవాదం గురించి కొత్తగా చెప్పేది ఏమీ లేదు.

కాంగ్రెస్ పార్టీతోనే జట్టుకట్టినప్పుడే చంద్రబాబు నాయుడు ఆ అవకాశవాదాన్ని పరాకాష్టకు తీసుకెళ్లారు. ఎదురుదెబ్బ తిన్నారు. అయినా యూటర్న్ లు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు మరింత డోలాయమాన స్థితిలోకి పడిపోయారని అంటున్నారు పరిశీలకులు.

అది భారతీయ జనతా పార్టీ విషయంలోనే. ప్రస్తుతానికి అయితే చంద్రబాబునాయుడు బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. అందు కోసం కాషాయధారుల కాళ్ల మీద పడుతూ ఉన్నారు ఆయన. ఆ సంగతలా ఉంటే.. వివిధ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రాభవానికి చెక్ పడుతూ ఉంది. మొన్నటి వరకూ డెబ్బై శాతం దేశాన్ని రాష్ట్రాల వారీగా బీజేపీ పాలించేది. అలాంటిది ఇప్పుడు నలభై శాతానికి పడిపోయింది.

అతి త్వరలోనే కీలకమైన రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. వాటిల్లో గనుక కమలం పార్టీ నెగ్గుకు రాలేకపోతే ఆ పార్టీ కి కేంద్రంలో కూడా కౌంట్ డౌన్ మొదలైనట్టే అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సంకట పరిస్థితుల్లో పడిపోయారని, ఒకవైపు బీజేపీ ఏమో తెలుగుదేశం పార్టీని మింగేయాలని చూస్తోంది. వచ్చిన వారిని వచ్చినట్టుగా చేర్చుకుంటూ ఉంది కమలం పార్టీ. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ ఆ పార్టీతో పొత్తు కోసం దేబిరించడం చంద్రబాబు రాజకీయ స్థితిని మరింత దిగజారుస్తుంది. అయినా సరే అని బీజేపీతో దోస్తీ చేసేదా, లేక బీజేపీకి కొన్నేళ్లకు అయినా కౌంట్ డౌన్ ఉంటుందనేది కామ్ గా ఉండేదా? అనే అంశాల విషయంలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుది డోలాయమాన స్థితే అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.