Begin typing your search above and press return to search.

రాజకీయాల్లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఓ సంచలనం కానుందా..?

By:  Tupaki Desk   |   22 Nov 2019 1:30 AM GMT
రాజకీయాల్లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఓ సంచలనం కానుందా..?
X
తెలుగుదేశం...37 ఏళ్ల చరిత్ర గల పార్టీ. ఆ పార్టీ ఎలా ఆవిర్భవించింది. ఎన్టీఆర్ ఎన్ని నెలల్లో సీఎం అయ్యారు. అలాగే నాదెండ్ల భాస్కరావు ఎన్టీఆర్‌ ని మోసం చేసి ఏ విధంగా సీఎం అయ్యారు ? మళ్ళీ ఎన్టీఆర్ తిరిగి అధికారం ఎలా చేజిక్కించుకున్నారనే విషయాలు ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాగే 1989లో ఓడిపోయిన ఎన్టీఆర్ 1994లో మళ్ళీ గెలిచి సీఎం అవ్వడం - 1995లో చంద్రబాబు ఎన్టీఆర్‌ ని దించేసి సీఎం అవ్వడం లాంటి చరిత్ర మరిచిపోలేని విషయాలు కూడా తెలుసు. ఇక అక్కడ నుంచి బాబు ఆధ్వర్యంలో టీడీపీ ప్రయాణం సాగుతూ 2019 వరకు చేరుకుంది.

అయితే ఇక్కడ నుంచే టీడీపీలో కొత్త కథ మొదలయ్యేలా కనిపిస్తోంది. ఈ కొత్త కథ కూడా చంద్రబాబు వయసు మీద పడటం.. ఈ యేడాది ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవ‌డం... ధిక్కార స్వ‌రాలు ఎక్కువ అవ్వ‌డం వల్లే మొదలైంది. ఈ 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయి 23 సీట్లు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఓడిపోయిన దగ్గర నుంచి అనేకమంది నేతలు పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు.

పార్టీ నుంచి కీల‌క నేత‌లు కూడా బ‌య‌ట‌కు వెళ్లిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు వయసు - నారా లోకేశ్ అసమర్ధత అని పార్టీ కార్యకర్తల్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం చంద్రబాబు వయసు 70 ఏళ్ళు మహా అయితే ఆయన మరో ఐదారేళ్లు మాత్ర‌మే రాజకీయం చేయగలరు. అయితే ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అందుకే కుమారుడు లోకేశ్ ని నాయకుడుని చేయాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. లోకేశ్ కు పార్టీని నడిపించే సమర్ధత లేదని పార్టీలో చాలా మంది ఫిక్స్ అయిపోయారు.

ఇక ఈ టైంలోనే ఎన్టీఆర్ రాజ‌కీయారంగ్రేటానికి సంబంధించిన వ్యాఖ్య‌లు కూడా వ‌స్తున్నాయి. 2024లో కూడా టీడీపీ పొత్తుల‌తోనే ? లేదా సొంతంగానో పోటీ చేస్తుంది. ఆ ఎన్నిక‌ల‌కు కూడా ఎన్టీఆర్ దూరంగానే ఉండే ఛాన్స్ ఉంద‌నే ఎక్కువ మంది విశ్లేష‌కుల అంచ‌నా. 2029 నాటికి ఎన్టీఆర్ వయసు 46 ఏళ్ళు అవుతుంది. అంటే కరెక్ట్ గా బాబు రిటైర్ అయ్యి...ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి దిగే సమయం. బాబు ఎన్టీఆర్‌ కు ఎలాగూ పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించ‌రు.

అలా జ‌ర‌గ‌ని ప‌క్షంలో 2029కు కాస్త ముందే ఎన్టీఆర్ సొంత పార్టీతో ఎంట్రీ ఇస్తే.. అప్పుడు టీడీపీ రెండుగా చీలిపోవ‌డం ఖాయం. ఇప్పటికే ఎన్టీఆర్ ని పార్టీలోకి తీసుకురావాలని కార్యకర్తల్లో డిమాండ్ గట్టిగా వస్తుంది. ఇది 2024 ఎన్నిక‌ల‌కు ముందు మ‌రింత ఎక్కువ అవుతుంది. మ‌రి బాబు లోకేశ్‌ ను ప‌క్క‌న పెట్టి ఎన్టీఆర్‌ ను పార్టీలోకి తీసుకు వ‌చ్చి పెద్ద పీట వేస్తాడా ? లేదా ? ఎన్టీఆరే పార్టీ పెడ‌తాడా ? అన్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్సే అయినా... ఎన్టీఆర్ సొంతంగా పార్టీ పెట్టాల్సి వ‌స్తే అది 2024 త‌ర్వాతే ఉండ‌నుంది.