Begin typing your search above and press return to search.
బాబు ఉచితాల బాట.. విజన్ మాటేంటి? విశ్లేషకులు ఏమన్నారంటే
By: Tupaki Desk | 29 May 2023 3:00 PMటీడీపీ అధినేత చంద్రబాబు అంటే.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించే మాట.. విజన్ ఉన్న నాయకుడు అనే! అభివృద్ధి-దూర దృష్టి రెండు కళ్లుగా చంద్రబాబు ముందుకు సాగుతారనే పేరుంది. ప్రాంతాలతో పనిలేకుండా.. చంద్రబాబుకు శిలా శాసనంగా నిలిచిపోయిన పేరు కూడా ఇదే.
అయితే.. తాజాగా మహానాడులో చంద్రబాబు చేసిన మేనిఫెస్టో ప్రకటన అందరినీ విస్మయానికి గురిచేసింది. 'భవిష్యత్తుకు గ్యారెంటీ' పేరుతో ఉచిత పథకాలను చంద్రబాబు ప్రకటించారు.
వాస్తవానికి ఉచితాలకు..చంద్రబాబుకు చాలా దూరం. చేపలు తినిపించడం కాదు.. చేపలు పట్టడం నేర్పా లనేది ఆయన సూత్రం. ఇది చాలా మంచిది. ఉపాధి, ఉద్యోగాల కల్పన ద్వారా సమాజాన్ని ఆర్థిక వనరుగా మార్చాలనే ప్రయత్నం చంద్రబాబు ను చాలా మందిలో మంచి నాయకుడిగా గుర్తింపు వచ్చేలా చేసింది.
అయితే.. ఇప్పటికిప్పుడు.. ఆయన అనూహ్యంగా ఉచితాల బట్టారు. వచ్చే ఎన్నికల్లో మహిళల నుంచి రైతుల వరకు, యువత నుంచి కుటుంబాల వరకు ఉచితాలు ప్రకటించారు.
సరే.. రాజకీయ అవసరం కాబట్టి.. ఇలా చేశారని అనుకున్నా.. మరి విజన్ మాటేంటి? చంద్రబాబు ఇటీ వల కాలంలో చెబుతున్న విజన్@2047 అమలు కావాలంటే.. భారీ ఎత్తున నగదు కావాలి. ప్రభుత్వానికి ఆదా యం కావాలి.
పోనీ.. చంద్రబాబు ప్రభుత్వం ఆదాయంపై దృష్టిపెట్టి.. ఆదాయాన్ని జనరేట్ చేసినా.. వచ్చిన ఆదాయం వచ్చినట్టు.. ఉచితాలకే పోతే.. ఇక, ప్రభుత్వం వద్ద మిగిలేది ఏంటి? అనేది ఇప్పుడు రాజకీయం గా విశ్లేషకులు సంధిస్తున్న ప్రశ్న. మరిదీనిపై టీడీపీ నాయకులు ఏం చెబుతారో చూడాలి.