వైరస్ పై కేంద్రం కీలక ప్రకటన: లక్ష మందికి 0.3 మరణాలే..

Tue May 26 2020 21:30:59 GMT+0530 (IST)

Center report on Virus: 0.3 deaths per lakh people

మహమ్మారి వైరస్ విజృంభణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. లక్ష మంది జనాభాలో 0.3మంది మాత్రమే మరణిస్తున్నారని ప్రకటించింది. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే ఆ వైరస్ మరణాల రేటు అత్యంత తక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో మంగళవారం కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది.దేశంలో ఆ వైరస్‌తో ప్రస్తుతం మరణాల రేటు 2.87 శాతంగా ఉందని తెలిపింది. లక్ష మంది జనాభాలో 0.03శాతం మరణాలు మాత్రమే నమోదవుతున్నట్లు పేర్కొంది. లక్ష జనాభాకి 4.4 మరణాలను ప్రపంచం నమోదు చేస్తుంటే భారత్ మాత్రం 0.3 మరణాలను మాత్రమే నమోదుచేస్తున్నట్లు వివరించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య లక్షా 50 వేలకు చేరువయ్యాయని మరణాల సంఖ్య 4 వేలు దాటిందని ప్రకటించారు.

సరైన సమయంలో వైరస్ తీవ్రతను గుర్తించి పకడ్బందీ చర్యలు తీసుకోవడం లాక్ డౌన్ విధించడంతో ప్రస్తుతం ఆ వైరస్ ప్రభావం తక్కువ ఉందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రకటించారు. దేశంలో ఇప్పటివరకు 60490 మంది ఆ వైరస్ నుంచి కోలుకున్నారని తెలిపారు. ప్రస్తుతం రికవరీ రేటు 41.61 శాతంగా ఉందని వెల్లడించారు.

దేశంలో తక్కువ మరణాల రేటు నమోదవడం చాలా మంచిదని ఐసీఎంఆర్ డైరెక్టర్ డైరక్టర్ జనరల్ బలరామ్ భార్గవ తెలిపారు. వైరస్ కంటిన్యూ అవుతుందని పేర్కొన్నారు. కాకపోతే ఆ వైరస్ పరీక్షల సంఖ్య మరింత పెరిగినట్లు చెప్పారు. ప్రస్తుతం రోజుకి 1.1 లక్షల మందికి టెస్ట్‌లు చేస్తున్నట్లు తెలిపారు.