Begin typing your search above and press return to search.

ఓటీటీల‌కు కేంద్రం షాక్..ఇక‌పై అవి త‌ప్ప‌న‌స‌రి!

By:  Tupaki Desk   |   26 May 2023 3:07 PM GMT
ఓటీటీల‌కు కేంద్రం షాక్..ఇక‌పై అవి త‌ప్ప‌న‌స‌రి!
X
ఓటీటీ ప్లాట్ ఫామ్ ల‌కు కేంద్రం షాకిచ్చింది. ఇక‌పై ఓటీటీల్లోనూ పొగాగు వ్య‌తిరేక యాడ్లు ప్ర‌ద‌ర్శించాల‌ని ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఓటీటీలో ప్ర‌సార‌మ‌య్యే వెబ్ సిరీస్ లు..సినిమాలు పొగాకు ఉత్ప‌త్తుల వినియో గాన్ని..ధూమ‌పానాన్ని ఎటువంటి హెచ్చ‌రిక‌లు లేకుండా ఇష్టాను సారం సినిమాలో చూపిస్తున్నారు. ఇది సిగ‌రెట్టు- పొగాకు ఉత్ప‌త్తుల చ‌ట్టం 2003 ఉల్లంఘ‌న కింద‌కు వ‌స్తుందని కేంద్ర భావిస్తుంది.

దీంతో ఓటీటీల‌పై కొర‌డా ఝుళిపించిన‌ట్లు తెలుస్తొంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ లు కూడా త్వ‌ర‌లో థియేట‌ర్.. టెలివిజ‌న్ త‌ర‌హాలో పొగాకు వ్య‌తిరేక హెచ్చ‌రిక‌లు త‌ప్ప‌ని స‌రిగా ప్ర‌ద‌ర్శించాలంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

దీనికి సంబంధించి గుర‌వారం అధికారిక వ‌ర్గాలు ప్ర‌క‌ట‌నిచ్చాయి. సిగ‌రెట్టు మ‌రియు ఇత‌ర పొగాకు ఉత్ప‌త్తుల ( ప్ర‌క‌ట‌న‌ల నిషేధం మ‌రియు వాణిజ్యం.. ఉత్ప‌త్ని.. స‌ర‌ఫరా.. పంపిణీ) రూల్స్ 2004 స‌వ‌ర‌ణ‌ల‌ను మంత్రిత్వ శాఖ ప‌రిశీలిస్తోంది.

దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే అధికారిక ఉత్త‌ర్వులు రానున్నాయి. ఆన్ లైన్ కంటెంట్ ప‌బ్లిష‌ర్ ప్రొగ్రామ్ ప్రారంభంలో..మ‌ధ్యంలో క‌నీసం 30 సెకెన్లు పాటు పొగాకు వ్య‌తిరేక హెచ్చ‌రిక‌లు త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌ద‌ర్శించాలని అధికారిక వ‌ర్గాలు వెల్ల‌డించాయి. పోగాకు యోక్క దుష్ప్రభావాల‌పై కనీసం 20 సెకెన్ల ఆడియో విజువ‌ల్-డిస్ క్లైమ‌ర్ ని ప్రోగ్రామ్ ప్రారంభం లో..మ‌ధ్య‌లో చూపించాల‌ని ఆదేశించింది.

పోగాకు వినియోగాన్ని ప్రోత్స‌హించ‌డంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లు ముఖ్య పాత్ర పోషిస్తాయ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డ్డాయి. ఇది పిల్లలు..యువ‌త‌పై పెద్ద ఎత్తున ప్ర‌భావం చూపుతున్నాయ‌ని అధికారులు తెలిపారు. దీంతో ఇక‌పై సినిమా త‌ర‌హాలో ఓటీటీలోనూ పోగాకు ఉత్ప‌త్తులు..మ‌ద్య‌పాన వ్య‌తిరేక ప్ర‌ద‌ర్శ‌న‌లు త‌ప్ప‌నిస‌రి తెలుస్తోంది. ఇంకా క్ర‌మేణా ఓటీటీపై మ‌రిన్ని నియంత్ర‌ణ‌లు త‌ప్ప‌నిసరి కానున్నాయి.

క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఎంట‌ర్ టైన్ మెంట్ లో ఓటీటీ కీల‌క పాత్ర పోషిస్తుంది. అన్నీ ఓటీటీల‌కు భారీ ఎత్తున వినియోగ‌దారులున్నారు. కోట్లాది మంది ఓటీటీల్ని వినియోగిస్తున్నారు. ఒక‌దానికొక‌టి పోటీ ప‌డి ఎన్నో వెసులు బాటులు తీసుకొస్తున్నాయి. కానీ పోగాకు..మ‌ద్య‌పాన..సిగ‌రెట్ల వ్య‌తిరేక ప్ర‌ద‌ర్శ‌న‌లు మాత్రం ప్ర‌భుత్వాలు హెచ్చ‌రించే వ‌ర‌కూ ప‌ట్టించుకున్న పాపాన పోరు.