భారత్ వేరియంట్ కథనాల పై కేంద్రం ఆగ్రహం

Wed May 12 2021 21:10:55 GMT+0530 (IST)

Center angry over Bharat variant articles

భారత్ లో బయటపడిన కరోనా వైరస్ బి1617 రకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.వో) ఆందోళనకరమైన స్ట్రెయిన్ గా వర్గీకరించిందంటూ నిన్నటి నుంచి తెగ ప్రచారం సాగుతోంది. దీనిపై కేంద్రప్రభుత్వం తాజాగా స్పందించింది.బి-1617.. భారత్ రకం స్ట్రెయిన్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎక్కడా వెల్లడించలేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది.మీడియా సంస్థలే దీనిపై ప్రజలను భయాందోళనకు గురిచేసేలా కథనాలు అల్లుతున్నాయని పేర్కొంది.బి-1.617ను 'భారత వేరియంట్' అని డబ్ల్యూ.హెచ్.వో ఎక్కడా పేర్కొనలేదని కేంద్రం తెలిపింది.  ఆ వార్తలు పూర్తిగా నిరాధారమైనవే కాక అవాస్తమని కొట్టిపారేసింది. . బి.1.617ను భారత రకం స్ట్రెయిన్ అని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పలేదు.  కరోనా వైరస్‌ల విషయంలో డబ్ల్యూహెచ్‌వో 32 పేజీల నివేదిక ఇచ్చింది. అందులో ఎక్కడా 'భారత్' అనే పదం లేదు''అని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.

అయితే డబ్ల్యూ.హెచ్.వో కోవిడ్ విభాగా సాంకేతిక నిపుణురాలు డా. మారియా మాత్రం బీ1617 స్ట్రెయిన్ ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. భారత్ లో వెలుగుచూసిన ఈ వైరస్ వ్యాప్తిపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు.