తెలంగాణకు మళ్లీ అన్యాయం.. కేంద్రం వివక్ష

Thu Mar 30 2023 10:26:33 GMT+0530 (India Standard Time)

Center Discrimination For Telangana

తెలంగాణలోని నిజామాబాద్ ఎంపీగా పోటీచేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రధానంగా అక్కడి పసుపు రైతులకు ఇచ్చిన హామీ 'పసుపు బోర్డ్' తెస్తానని.. దీన్ని ముందు పెట్టే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను ఓడించారు. అయితే కట్ చేస్తే ఐదేళ్లు అవుతున్నా ఇంతవరకూ పసుపుబోర్డు తెలంగాణకు తీసుకురాలేదు అరవింద్. దీనిపై ఆయనకు అడుగడుగునా రైతులు నిలదీస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి దీనిపై తేల్చేసింది. ఎంపీగా గెలవడం కోసం రైతులను కల్వకుంట్ల కవితను అరవింద్ మోసం చేశాడన్న అపవాదును మూటగట్టుకున్నారు.తెలంగాణకు పసుపు బోర్డు మాత్రమే కాదు.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ రాష్ట్ర డిమాండ్ పై  కేంద్ర ప్రభుత్వం ఎట్టేకేలకు స్పందించింది. పార్లమెంట్ సాక్షిగా తన వైఖరిని స్పష్టం చేసింది. దాని లిఖితపూర్వకంగా తెలియజేసింది కూడా.. తెలంగాణలో పసుపు బోర్డును గానీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గానీ ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఏవీ తమ వద్ద లేవని తేల్చిచెప్పింది.

ఈ మేరకు పార్లమెంట్ లో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది.ఈ రెండింటినీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించింది. అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని తెలంగాణలో ఏర్పాటు చేయలేమని స్పష్టం చేసింది.

ఇప్పటికీ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ధర్మపురి అరవింద్ ను నిలదీస్తూనే ఉన్నారు. అయితే కేంద్రం మాత్రం పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన తమ వద్ద ఏదీ లేదని కుండబద్దలు కొట్టింది.  ఈ మేరకు కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

బీఆర్ఎస్ ఎంపీలు వెంకటేశ్ నేత పి.దయాకర్ జి.రంజిత్ రెడ్డి మాలోతు కవిత అడిగిన ప్రశ్నలకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్ సమాధానం ఇచ్చారు. దేశంలో పసుపు బోర్డు లేదా మరేదైనా మసాలా నిర్ధుష్ట బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని ఆమె తెలిపారు.

అదేవిధంగా ఖాజీపేట్ లో రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా తమ వద్ద లేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీంతో మరోసారి తెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతోందని బీఆర్ఎస్ ఎంపీ నినాదాలతో హోరెత్తించారు. కేంద్రం అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళతామన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.