Begin typing your search above and press return to search.

గురు పౌర్ణమి రోజు శాంతి మంత్రం జపించిన ప్రధాని మోడీ

By:  Tupaki Desk   |   4 July 2020 8:30 AM GMT
గురు పౌర్ణమి రోజు శాంతి మంత్రం జపించిన ప్రధాని మోడీ
X
ఆషాఢ పూర్ణిమ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో ఈ శుభ సందర్భంగా... మనం గురువుల్ని గుర్తుచేసుకోవాలని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ మానవాళికి శాంతి మార్గాన్ని బోధించిన బుద్ధ భగవానుడిని మోదీ స్మరించుకున్నారు. నివాళులు అర్పించారు. తధాగతుడు సూచించిన 8 సూత్రాల మార్గం... ఎన్నో దేశాలు, సమాజాల అభివృద్ధికి బాటలు పరిచిందని మోదీ గుర్తుచేశారు. దయ, జాలి గొప్పదనం తెలిసొచ్చిందన్నారు. ఆలోచించడానికీ, పాటించడానికీ బుద్ధుడి విధానాలు ఎంతో అనుకూలంగా ఉంటాయన్నారు ప్రధాని మోదీ.

21వ శ‌తాబ్ధం ప‌ట్ల తాను విశ్వాసంతో ఉన్నాన‌ని, త‌న యువ స్నేహితుల‌తో ఈ ఆశావాహ దృక్ఫ‌థంతో ఉన్న‌ట్లు తెలిపారు. విశ్వ‌స‌మ‌స్య‌ల‌కు యువ మేధావులు ప‌రిష్క‌రాలు వెతుకుతున్నార‌ని, భార‌త్‌ లో అతి పెద్ద స్టార్ట్ అప్ వ్య‌వ‌స్థ ఉన్న‌ద‌ని, యువ‌త మిత్రులంతా బుద్ధుడి బోధ‌న‌ల‌ను అనుస‌రించాల‌ని ప్ర‌ధాని మోదీ సూచించారు. బుద్ధుడి బోధ‌న‌లు మార్గ‌ద‌ర్శ‌కంగా నిలుస్తాయ‌న్నారు. ఆశ‌, ఆవిష్క‌ర‌ణ‌, క‌రుణ ఎలా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాయో తెలుసుకోవాలంటే, మీలాంటి యువ‌త మొద‌లు పెట్టిన స్టార్ట్ అప్‌ల గురించి తెలుసుకోవాల‌న్నారు.

గౌత‌మ బుద్ధుడు స‌ర్‌ నాథ్‌ లో చేసిన తొలి బోధ‌న‌ల గురించి మోదీ వివ‌రించారు. ఆశ‌, ఉద్దేశం గురించి ఆయ‌న మాట్లాడిన‌ట్లు తెలిపారు. బౌద్ధ‌మ‌తం మ‌ర్యాద‌ను నేర్పిస్తుంద‌ని, ప్ర‌జ‌ల‌ను ఎలా గౌర‌వించాలి, పేద‌ల‌ను ఎలా గౌర‌వించాలి, మ‌హిళ‌ల‌ను ఎలా గౌర‌వించాలి, శాంతి, అహింస‌ ను ఎలా గౌర‌వించాల‌న్న అంశాల‌ను నేర్పుతుంద‌న్నారు. అందుకే బుద్ధుడి బోధ‌న‌లు భూగ్ర‌హ స‌మ‌గ్ర ర‌క్ష‌ణ‌కు మేలైన అంశాల‌న్నారు. బుద్ధుడి ఎనిమిది బోధ‌న‌లు.. స‌మాజం, దేశాల పురోగ‌తి కి దోహ‌ద‌ ప‌డుతుంద‌న్నారు. ఆలోచ‌న‌లో, ఆచ‌ర‌ణ‌లో బుద్ధుడి బోధ‌న‌లు చాలా సింపుల్ ‌గా ఉంటాయ‌న్నారు. అసాధార‌ణ స‌వాళ్ల‌ను ఎదుర్కొనే ప‌రిష్కారాల‌ను బుద్ధుడి బోధ‌న‌లు క‌ల్పిస్తాయ‌న్నారు. గ‌తంలో, ప్ర‌స్తుతం ఆ బోధ‌న‌లు ఎన్నో ప‌రిష్కారాల‌ను చూపాయ‌ని, భ‌విష్య‌త్తు లో కూడా బుద్ధుడి బోధ‌న‌లు దిక్సూచీ గా ఉంటాయ‌న్నారు. బుద్ధుడి బోధ‌న‌‌లు ప్రేర‌ణ క‌లిగిస్తాయ‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ఓవైపు చైనా సరిహద్దుల్లో బలగాలతో రెచ్చిపోతుంటే... ప్రధాని మోదీ... యుద్ధం వల్ల ఒరిగేది ఏమీ ఉండదని... శాంతి మంత్రమే సరైన విధానమని పరోక్ష సంకేతం ఇచ్చారు. మరి చైనా తన తీరు మార్చుకుంటుందా? కుట్రపూరిత స్వార్థ బుద్ధిని వదులుకుంటుందా... అంటే... దేశ ప్రజల్లో అలాంటి నమ్మకం కనిపించట్లేదు. డ్రాగన్‌ తో డేంజరే అని ప్రజలు భావిస్తున్నారు. చైనా యుద్ధం చేస్తే మాత్రం... భారత్ గట్టి గా బదులివ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు.