Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల్లో మహమ్మారి విజృంభణ!

By:  Tupaki Desk   |   18 Jun 2020 6:10 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో మహమ్మారి విజృంభణ!
X
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. దేశవ్యాప్తంగా పరిస్థితి మరింత దిగజారుతోంది. రోజురోజుకు వేలసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గడం లేదు. బుధవారం కొత్తగా 269 కొత్త పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 5675కి చేరింది. ఇందులో 2412 యాక్టివ్ కేసులు ఉండగా.. 3071మంది వైరస్ బారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 192మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ కరోనాతో ఒక్కరు మరణించగా.. 151మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్త కేసుల్లో హైదరాబాద్ పరిధిలోనే 214 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.

ఇక ఏపీలో కరోనా వైరస్ భయంకరంగా విస్తరిస్తోంది. తాజాగా బుధవారం 351 పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఏపీ వైద్యఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 275మంది కాగా.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 76మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. బుధవారం ఇద్దరు కరోనాతో చనిపోయారు. తాజాగా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5555కి చేరింది. 2906మంది కోలుకోగా.. 2559మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో వైరస్ తో చనిపోయిన వారి సంఖ్య 90కి పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

*భారత్ లో పెరుగుతున్న కరోనా

భారత్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10974 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,54,065కి చేరింది. నిన్న ఒక్కరోజే దేశంలో 2003మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 11,903కి చేరింది.

*ప్రపంచవ్యాప్తంగా 83 లక్షలకి చేరుకున్న కేసులు

ప్రపంచవ్యాప్తంగా బుధవారం కొత్తగా లక్షకిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 83,99,486కి చేరాయి. అలాగే మొత్తం మరణాల సంఖ్య 4 లక్షలు దాటింది. 451275మంది చనిపోయారు.

అమెరికాలో మళ్లీ కరోనా జోరు పెరిగింది. బుధవారం కొత్తగా 26వేల మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య అమెరికాలో 22.34 లక్షలకి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 1,19,9421కి చేరింది. అమెరికా తర్వాత బ్రెజిల్ - రష్యా - స్పెయిన్ - ఇటలీ - ఫ్రాన్స్ - జర్మనీ - బ్రిటన్ - టర్కీ దేశాల్లో పాజిటివ్ కేసుల తీవ్రత బాగా ఉంది