చిక్కుల్లో పవన్ కళ్యాణ్.. కేసు పెట్టిన జనసేన నేత

Sun Dec 08 2019 11:01:56 GMT+0530 (IST)

జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ఏపీలోని జిల్లాలన్నింటిలో తిరుగుతున్న పవన్ కళ్యాణ్ ఆ పని చేసుకోకుండా అధికార వైసీపీ సర్కార్ ను కొద్దిరోజులుగా టార్గెట్ చేసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ పై మత ముద్ర వేసి మత కుల విద్వేశాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.కొద్దిరోజులుగా ఏపీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తూ ఆయన కులాన్ని మతాన్ని లక్ష్యంగా చేసుకొని జనసేనాని పవన్ సమావేశాల్లో పరుష వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ వ్యాఖ్యలపై తాజాగా పవన్ కళ్యాణ్ కు షాక్ తగిలింది. పవన్ కు సొంత పార్టీ జనసేన నేతలే జలక్ ఇచ్చారు. కులం మతంపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆయనపై కేసు పెట్టారు.

తాజాగా జనసేన నేత అలివర్ రాయ్.. పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టారు. పవన్ కళ్యాణ్ కులమతాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పున్నమిఘాట్ వద్ద మత మార్పిడులు జరుగుతున్నాయన్న పవన్ వ్యాఖ్యలను అలివర్ రాయ్ ఖండించారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నా పవన్ స్పందించలేదని.. ఆయనలో పశ్చాత్తాపం లేదని.. అందుకే కేసు పెట్టానని అలివర్ రాయ్ పేర్కొన్నారు.