వయాగ్రా.. ఆత్మహత్యలు తగ్గిస్తుందా? సంచలన సర్వే!

Tue Sep 21 2021 23:00:01 GMT+0530 (IST)

Can Suicides Be Prevented With Viagra

వయాగ్రా.. దీనికి పెద్దగా వివరణ అవసరం లేదు. పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని కొన్ని గంటల పాటు `నిలిపి` ఉంచే టాబ్లెట్ ఇది. అంగస్థంభన సమస్యలకు వయాగ్రాతో చెక్ పెట్టొచ్చనేది వైద్యులు చెప్పే మాట. అయితే.. ఇప్పుడు ఇదే మాత్ర.. ఆత్మహత్య లను కూడా నివారిస్తోందని అంటున్నారు స్వీడన్ పరిశోధకులు. అదేంటి? అనే ఆశ్చర్యం సహజం. కానీ స్వీడన్‌కు చెందిన వైద్యులు ఇచ్చిన నివేదికలు.. పరిశోదకులు చేసిన సర్వే.. మొత్తం కలిపి తాజాగా ఇచ్చిన నివేదిక ప్రకారం.. వయాగ్రా ఒక్క శృంగారానికే కాదు.. ఆత్మహత్యలు నివారించేందుకు కూడా ఉపయోగపడుతోందని అంటున్నారు. మరి అసలు విషయం ఏంటో చూద్దాం.స్వీడన్‌లో ఇటీవల కాలంలో ఆత్మహత్యలు పెరిగాయి. ముఖ్యంగా 50-59 ఏళ్ల మధ్య ఉన్నపురుషులే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఆత్మహత్యలు ఎక్కువగా చేసు కుంటున్న దేశాల్లోనూ స్వీడన్ ముందుంది. దీనికి కారణం.. డిప్రెషన్(ఒత్తిడి) అని వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఒత్తిడికి కారణాలు కూడా అన్వేషించారు.. ఒకటి ఈ వయసులో పురుషులు శృంగారానికి దూరమవడం.. వివిధ కారణాలతో అంగస్థంభన సమస్యలు ఎదుర్కొనడం ఎక్కువగా ఉంది. దీంతో వారు మానసిక శారీరక ఒత్తిడికి గురై.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తేల్చారు.

అంతేకాదు.. వయాగ్రా(సిల్డినాఫిల్ జనరిక్) వినియోగిస్తున్న ఇదే వయసు వారిలో ఈ పరిస్థితి లేదని గుర్తించారు. వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా వ యాగ్రా వినియోగిస్తున్న దేశాల్లో అమెరికా బ్రిటన్ స్విట్జర్లాండ్ తర్వాత స్వీడనే ఉంది. అయితే.. ధరలు ఒక్కొక్క దేశంలో ఒక్కొ క్క రకంగా ఉంటున్నాయి. ఇటీవల వరకు స్వీడన్‌లో వయాగ్రా ధర.. 12 మాత్రల షీట్ 180 డాలర్లు ఉంది. దీంతో ఎక్కువ మంది ఈ టాబ్లెట్లను వినియోగించే వారు కాదు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురై.. శృంగారానికి దూరమై.. మానసిక ఆందోళనలతో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉండేది.

ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం.. వాటి ధర ఇప్పుడు కేవలం 45 డాలర్లకు తగ్గింది. ఒకేసారి వయాగ్రా ఔషధంపై 75 శాతం ధర తగ్గడంతో ఈ టాబ్లెట్లు వాడేవారు సంఖ్య పెరిగింది. స్వీడన్ లో 50 నుంచి 59 ఏళ్ల మధ్యవారు ఆత్మహత్యలు అధికంగా చేసుకుంటున్నారు. అంగస్తంభన చికిత్సలో భాగంగా ఆ ఏజ్ గ్రూపు వారికి ఈ ట్యాబ్లెట్లను సూచిస్తుంటారు. దీంతో ఇప్పుడు ఈ టాబ్లెట్ల వినియోగం పెరగడంతో వారంతా ప్రశాంతంగా ఉంటున్నారు. ఒత్తిళ్లు తగ్గాయి. ఫలితంగా.. ఆత్మహత్యల సంఖ్య కూడా తగ్గిపోయిందని సర్వేలు చెబుతున్నాయి. సిల్డినాఫిల్ ధర తగ్గిన తర్వాత.. ఆ ఏజ్ గ్రూపులో ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య నెలకు సగటును 65 కేసులు తగ్గినట్లు సర్వేలో గుర్తించారు. ఇదీ.. సంగతి!

కొసమెరుపు ఏంటంటే.. వయాగ్రా నేరుగా ఆత్మహత్యలను తగ్గించదు. కేవలం ఒత్తిళ్లను అందునా.. శృంగారానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంద్వారా.. మానసిక ఒత్తిడిని తగ్గించి.. ఆత్మహత్యలను పరోక్షంగా అడ్డుకుంటుందన్న మాట!!