Begin typing your search above and press return to search.

కన్నా 0.8 నుంచి 4.5కు తీసుకెళ్లాడు..సోము వీర్రాజు నంబర్ ఎంత?

By:  Tupaki Desk   |   11 Aug 2020 1:30 PM GMT
కన్నా 0.8 నుంచి 4.5కు తీసుకెళ్లాడు..సోము వీర్రాజు నంబర్ ఎంత?
X
బీజేపీ గత ఎన్నికల్లో ఇన్ డైరెక్టుగా వైసీపీకి సపోర్టు చేసి వ్యక్తిగతంగా చతికిల పడిపోయిందన్న ప్రచారం నేతల్లో ఉంది. ఎన్నికల తరువాత విద్యుత్ బిల్లుల ధరాఘాతం మీద రివ్యూ చేస్తాం అని జగన్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అలా రివ్యూ చేయవద్దని.. కేంద్ర ప్రభుత్వం వద్ద ‘రేట్ రెగ్యులేటరీ ’ ఉందని.. అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడి పెట్టాయని కేంద్రం లేఖలో వివరించింది. కానీ చంద్రబాబు కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాల్లో గోల్ మాల్ జరిగిందని భావించిన సీఎం జగన్ వినకపోగా విద్యుత్ ధరల సమీక్షకే నిర్ణయించి ఆ దిశగా చర్యలు చేపట్టారు.

ఈ వివాదం తరువాత నుంచి కేంద్రం జగన్ కి అపాయింట్ మెంట్ ఇవ్వకుండా కొంత దూరం పెట్టినట్టు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటున్నారు. తరువాత రాయలసీమలో కొంత మంది రెడ్డి నాయకులు టీడీపీ నుంచి బీజేపీకి జంప్ అయ్యారు. సుజనా చౌదరి బ్యాచ్ బీజేపీలోకి జంప్ అయ్యింది. ఇది అంతా బీజేపీ కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు జరిగింది. ఈ చేరికలతో బీజేపీ ఇమేజ్ కూడా కొంచెం పెరిగింది. ఒక సర్వే ప్రకారం కన్నా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ ఓటు బ్యాంకు 0.8 నుంచి 4.5శాతం వరకు పెరిగిందని తేలింది.

అయితే సడన్ గా కన్నా టీడీపీతో ఇన్ డైరెక్ట్ గా జతకట్టాడు అని వైసీపీ బాగా ఫోకస్ చేసింది. ఈ ప్రచారంతో ఏపీలో బీజేపీని.. బీజేపీ అధ్యక్షుడిని నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. వైసీపీ ట్రాప్ లో బీజేపీ పడి సడెన్ గా ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్న.. ప్రజల్లో డైరెక్టుగా ఒక్కసారి కూడా గెలవని సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిని చేసింది. కన్నాను తొలగించింది.

సోము వీర్రాజు ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత నేరుగా చిరంజీవి ని, జనసేన అధినేత పవన్ కళ్యాన్ ని కలిశాడు.ఈ పరిణామంతో మళ్లీ కుల రాజకీయాలు ఊపందుకున్నాయని తెలుస్తోంది. సోము వీర్రాజు అమరావతి మీద క్లారిటీ లేకుండా ఉన్నాడని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అమరావతిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా సైలెంట్ గా ఉండడం నష్టం చేస్తుందంటున్నారు. ఉద్యమం చేస్తే కొంత ఆ పార్టీకి మైలేజ్ వస్తుందని.. అలాంటిది ఇప్పుడు బీజేపీలో కనిపించడం లేదు. బీజేపీ స్తబ్దు రాజకీయాల వల్ల టీడీపీ నుంచి బీజేపీలోకి జంపింగ్ లు ఆగిపోతాయని టీడీపీ వాళ్లు సంతోషంగా ఉన్నారట.. సోము వీర్రాజు బీజేపీ ఓటు బ్యాంకును 0.8శాతం నుంచి పెంచుతాడా లేదా తగ్గిస్తాడా అన్నది ముందు ముందు చూడాలని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.