ఈసారి నారాయణ వ్యాఖ్యలకు బీజేపీ నేత బలి!

Fri Aug 12 2022 16:03:32 GMT+0530 (India Standard Time)

CPI Narayana Comments on BJP President

ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై ఘాటు వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత క్షమాపణలు చెప్పిన సీపీఐ నారాయణ ఈసారి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై మాటల తూటాలు పేల్చారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పోటీ చేసిన మునుగోడులో పోటీ చేయాలా? వద్దా? అనేది తాము తేల్చుకుంటామని.. మా గురించి చెప్పడానికి నువ్వెవవడివి కోన్కిస్కావి అంటూ నిప్పులు చెరిగారు. బండి సంజయ్ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. దమ్ము ధైర్యం గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్ కు ఎక్కడిది? అని నారాయణ ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి వచ్చిన దమ్ము తప్పితే బండి సంజయ్ కు ఉన్న దమ్ము ఏంటి? అని నిలదీశారు.

ఢిల్లీ నుండి వచ్చిన దమ్మే తప్ప.. అతడి దగ్గర ఇంకేముందని నారాయణ మండిపడ్డారు. బీజేపీ నేతలు వారి గురించి వారు చూసుకోవాలని తమ గురించి మాట్లాడే అర్హత దమ్ము బండి సంజయ్ కు లేదని నారాయణ తేల్చిచెప్పారు. తమ గురించి ప్రశ్నించే అధికారం బండి సంజయ్ కు ఎవడు ఇచ్చాడని నిలదీశారు.

మునుగోడులో పోటీ చేయాలా వద్దా అని తామే నిర్ణయించుకుంటామన్నారు. అంతేగానీ మీ సలహాలు తమకేమీ అక్కర్లేదన్నారు. దమ్ము గురించి మాట్లాడేముందు కాస్త ఆలోచించుకుని మాట్లాడితే మంచిదని బండి సంజయ్ పై నారాయణ ధ్వజమెత్తారు.

మునుగోడు నియోజకవర్గంలో వామపక్షాలకు గతంలో మంచి బలం ఉండేది. ఇప్పుడు కూడా చెప్పుకోదగిన స్థాయిలోనే బలం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా లెఫ్ట్ పార్టీలపై విమర్శలు చేశాయి.

ఓట్లు చీలకుండా ఉండటానికి లెఫ్ట్ పార్టీలు టీఆర్ఎస్ కు మద్దతిస్తాయన్నారు. దీంతో తమను ఎన్నికల గోదాలోకి లాగడంతో తాజాగా నారాయణ.. బండి సంజయ్పై నిప్పులు చెరిగా