Begin typing your search above and press return to search.

హీరోయిన్స్ ని తలదన్నేలా ఉప ముఖ్యమంత్రి వైఫ్ ఫోటో షూట్!

By:  Tupaki Desk   |   5 Jun 2023 6:00 PM GMT
హీరోయిన్స్ ని తలదన్నేలా ఉప ముఖ్యమంత్రి వైఫ్ ఫోటో షూట్!
X
ఆమె ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి! గతంలో బ్యాంకర్ గా పని చేసిన ఆమె... ఒక నటి, సింగర్, సామాజిక కార్యకర్త కూడా. తరచూ రకరకాల కార్యక్రమాల్లో పాల్గొనే ఆమె.. భర్త తో కలిసి ఎన్నికల ప్రచారం లో కూడా చురుగ్గా పాల్గొంటారు. సెలబ్రెటీల్లో సెలబ్రెటీలా, పొలిటీషియన్స్ లో పొలిటీషియన్స్ గా, సినీ జనాల్లో నటిగా ఇలా విభిన్న పాత్రలు నిర్వహిస్తున్న ఆమె... కచ్చితంగా బహుముఖ ప్రజ్ఞాశాలే! ఈ వివరణ అంతా ఎవరి గురించా.. అనుకుంటున్నారా... అమృత ఫడ్నవీస్ గురించి!

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్.. సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటారనేది తెలిసిన విషయమే. ఫేస్ బుక్, ఇస్‌ స్టాగ్రామ్, ట్విట్టర్.. ఇలా ఆల్ మోస్ట్ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్స్‌ పైనా ఆమె సెలెబ్రిటీ స్టేటస్‌ లో ఉన్నారు. ఆమె కు సోషల్ మీడియా లో లక్షల మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఆ సంగతి అలా ఉంచితే తాజా గా కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు అమృత. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.

డిప్యూటీ సీఎం భార్య అంటే ఇలాగే ఉండాలి.. తలదించుకునే నడక ఉండాలి.. కాటన్ చీర చుట్టుకుని కూర్చోవాలి.. వంటి యూజ్ లెస్ రూల్స్ ని ఏమాత్రం పట్టించుకోకుండా... ఇండిపెండెంట్ ఒమెన్ గా కనిపిస్తుంటారు అమృత ఫడ్నవీస్. కేవలం ఉపముఖ్యమంత్రి భార్య అనే గుర్తింపు తో కాకుండా.. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను సంపాదించుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తుంటారు!

ఇదే క్రమంలో... నిత్యం ఆన్ లైన్ లో యాక్టివ్ గా ఉంటూ... తనకు నచ్చినట్లు బ్రతికే విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా నడుచుకుంటుంటారు. ఈ క్రమంలో తాజాగా కొన్ని ఫోటోల ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అమృత. వీటి పై తెగ కామెంట్స్ వస్తున్నాయి.

తాజాగా అడవిలో ఫొటో షూట్‌ లో పాల్గొన్నారు అమృత ఫడ్నవిస్. ఇవ్వాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకు ని కొన్ని స్పెషల్ ఫోటోల ను తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్స్‌ పై షేర్ చేశారు. ఈ ఫోటోల లో ముదురు గులాబీ రంగు వెస్ట్రన్ ట్రాక్ సూట్‌ లో కనిపిస్తున్న ఆమె... పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను క్యాప్షన్ గా పెట్టారు! ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

"మానవ నిర్మిత ప్రపంచంలో కొందరు దారి తప్పగా... మరికొందరు మాత్రం ప్రకృతి ఒడి లో తమ ను తాము వెదుక్కునే ప్రయత్నాల్లో ఉన్నారు" అని కామెంట్ మొదలుపెట్టిన ఆమె... "పర్యావరణాన్ని ప్రేమించండి, పర్యావరణాన్ని ఆలింగనం చేసుకోండి, మిమ్మల్ని మీరు కనుగొనడానికి మీ జీవిత పరమార్ధాన్ని తెలుసుకోవడానికీ ప్రకృతిని రక్షించుకోండి" అంటూ ముగించారు.

కాగా... పంజాబ్ కు చెందిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ కు వై ప్లస్ భద్రత కల్పించిన సమయంలోనే... అమృతా ఫడ్నవీస్‌ కు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రత కల్పించిన సంగతి తెలిసిందే!