కర్ణాటక ఎన్నికల్లో చిత్రమైన పరిణామం ఉంది. ఇక్కడ ఇతర రాష్ట్రాల మాదిరిగా ఎన్నికలు పూర్తయ్యాక.. సీఎం అభ్యర్థిని ప్రకటించే సంస్కృతి లేదు. పార్టీ ఏదైనా.. కూడా సీఎం అభ్యర్థిని ముందుగానే ప్రకటించడం ద్వారా ప్రజల మన్ననలు పొందిన పరిస్థితి ఉంది. అయితే.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇదే తప్పు చేసింది. సీఎం అభ్యర్థి విషయంలో తర్జన భర్జన ఏర్పడడంతో పార్టీ మెజారిటీ సాధించలే కపోయింది. ఇక బీజేపీ తన అభ్యర్థిగా యడియూరప్పను ముఖ్యమంత్రిగా ప్రకటించింది. దీంతో దాదాపు అధికారం చేపట్టగిలిగే సంఖ్యలో సీట్లు సొంతం చేసుకుంది.
ఇక. ఇప్పుడు పరిస్థితిని గమనిస్తే.. కాంగ్రెస్ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పార్టీకి తగిలిన దెబ్బల నుంచి నేర్చుకున్న పాఠాలతో ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ప్రజల నాడిని పట్టుకుని.. ఇక్కడ మాజీ సీఎం.. వివాద రహిత సీఎం.. సిద్దరామయ్యను మరోసారి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తోంది. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా డీకే శివకుమార్ నిలబడతారన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ... ప్రజల్లో మాత్రం సిద్దరామయ్య పేరే వినబడుతోంది.
దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయనకే మొగ్గు చూపనుంది. పైగా. కాంగ్రెస్ ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సిద్దరామయ్యకు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ గెలుపు గుర్రం ఎక్కడానికి సిద్దరామయ్య ఇమేజ్ పనిచేయనుందననే సంకేతాలు వస్తున్నాయి.
ఇక బీజేపీ విషయానికి వస్తే.. యడియూరప్పను ఇప్పటికే పక్కన పెట్టేశారు. ఆయనను కాదని.. ప్రస్తుత సీఎం బొమ్మైను ముఖ్యమంత్రి అభ్యర్తిగా ప్రకటిస్తే.. ఆ పార్టీ పూర్తిగా డల్ అవడం ఖాయమని అంచనాలువ స్తున్నాయి.
బీజేపీ సీఎం అభ్యర్థిగా మరోసారి బసవరాజు బొమ్మైనే కోరుకుంటున్న వారు 31.1% మంది ఉన్నారు. జేడీఎస్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా హెచ్డీ కుమారస్వామి బరిలోకి దిగే అవకాశం 21.4% మేర ఉన్నట్టు సర్వేలో తేలింది. బీజేపీపై అసహనంగా ఉన్న వారు 57.1%గా ఉండగా.. ప్రభుత్వం మారకూడదని కోరుకుంటున్న వాళ్లు 25.8% మంది ఉన్నట్టు సర్వే చెప్పింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.