సీఎం కేసీఆర్ సైతం ఓ జిల్లాను దత్తత తీసుకుంటాడట..

Mon Jun 14 2021 10:00:39 GMT+0530 (IST)

CM KCR to Adopts a district in Telangana

ఎన్నికలన్నీ ముగియడంతో సీఎం కేసీఆర్ పాలనపై దృష్టిసారించారు. కరోనాతో సంవత్సరకాలంగా అభివృద్ధి పడకేసింది. అందరిలోనే ఫస్ట్రేషన్ వచ్చేసింది. ప్రజల్లోనూ ప్రభుత్వాలపై వ్యతిరేకత వచ్చింది.  ఈ క్రమంలోనే పాలనను పట్టాలెక్కించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు.పల్లెలు పట్టణాల అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉండాలని.. తానూ ఒక జిల్లాను దత్తత తీసుకుంటానని సీఎం కేసీఆర్ చెప్పారు.  పల్లె ప్రకృతి వనాల కోసం ప్రభుత్వ భూమి దొరకకపోతే ప్రైవేటు భూమిని కొనుగోలు చేయాలని సూచించారు.

6 నెలలు కష్టపడాలని.. గ్రామాలు పట్టణాలు ఎందుకు అభివృద్ధి కావో చూద్దాం అని కేసీఆర్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు.

గ్రామపంచాయతీ కార్యదర్శి పోస్టు ఒక్క గంట కూడా ఖాళీగా ఉండకూడదన్న సీఎం.. తక్షణమే వాటిని భర్తీ చేయాలని సూచించారు.

ప్రస్తుతం ప్రతీ వర్షకాలంలోనూ కేసీఆర్ ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తుంటారు. ఈ సంవత్సరం కూడా వాటిని మొదలు పెట్టారు.