Begin typing your search above and press return to search.
పశ్చిమ బెంగాళ్ పత్రికల్లో కేసీఆర్… రికార్డ్ స్థాయి ప్రకటనలు!
By: Tupaki Desk | 3 Jun 2023 10:05 AMజాతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పాలని టీఆరెస్స్ ను బీఆరెస్స్ గా మార్చి ముందుకు పోతున్నారు కేసీఆర్. ఈ క్రమంలో కర్ణాటక ఎన్నికల్లో పోటీచేస్తారని అంతా భావించినా... అనంతరం ఆయన సైలంట్ అయ్యారు. అయితే కేసీఆర్ ప్రధాన దృష్టి మహారాష్ట్ర రాజకీయాలపై పెట్టారనేది తెలిసిన విషయమే. ఇప్పటికే అక్కడ మూడు నాలుగు బహిరంగ సభలు పెట్టారు. తెలంగాణ - మహారాష్ట్ర బోర్డర్ జిల్లాల్లో చేరికలు, ప్రచార కార్యక్రమాలు మరీ తీవ్రతరం చేశారు. అయితే తాజాగా పశ్చిమ బెంగాల్ పై కూడ మనసుపడినట్లున్నారు బీఆరెస్స్ అధినేత.
బీఆరెస్స్ తో కేసీఆర్ తన జాతీయ రాజకీయ ఆకాంక్షను చాటుకున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ప్లాన్ చేసుకున్న ఆయన అందుకు తగ్గట్టుగానే పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. అయితే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే బీఆరెస్స్ లెవెల్ మరోలా ఉండేదని వినిపిస్తున్న కథనాల సంగతి కాసేపు పక్కనపెడితే... ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ పత్రికల్లో ప్రకటనలతో హోరెత్తించారు తెలంగాణ ముఖ్యమంత్రి.
పశ్చిమ బెంగాళ్ లోని స్థానిక వార్తాపత్రికల్లోని మెయిన్ ఎడిషన్ లో మొదటి ఆరు పేజీల్లో ప్రకటనలు గుప్పించారు కేసీఆర్. సాధారణంగా ఒక్క జాకెట్ యాడ్ వేస్తేనే ఆహో ఓహో అంటారు. కారణం... ప్రస్తుతం పత్రికలో ప్రకటనల టారిఫ్ అలా ఉంది మరి. ఈ సమయంలో ఏకంగా ఆరు పేజీల ప్రకటనలు గుప్పించారు బీఆరెస్స్ అధినేత. తెలంగాణలో ఒక్క జాకెట్ యాడ్ సంగతి పక్కనపెడితే... ఇలా ఎక్కడోఉన్న పశ్చిమ బెంగాల్ లో ఈస్థాయి ప్రకటలు ఇవ్వడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
అయితే... తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా రాష్ట్రం ఏస్థాయిలో అభివృద్ధి చెందిందో చెప్పేందుకు ఇచ్చారని కొందరు కవర్ చేస్తుంటే... ఈ రోజుని అడ్డుపెట్టుకుని, ప్రజాధానాన్ని వృథాచేస్తూ, తన జాతీయ రాజకీయాల పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు. మరి ఈ విషయాలపై కేసీఆర్ ఏదో వివరణ ఇస్తారని అనుకుంటే అంత అమాయకత్వం లేదని మరికొందరు క్లారిటీ ఇస్తున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కేసీఆర్ ఇంకా బీఆరెస్స్ ను ప్రారంభించలేదు. అక్కడ ప్రజలకు ఇంతవరకూ పార్టీని పరిచయం చేసిందీ లేదు.. నలుగురు నేతలతో కలిసి చిన్న మీటింగ్ పెట్టిందీ లేదు! దీంతో... పెట్టబోయే పార్టీకి ముందుగానే తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ప్రకటనలు ఇచ్చి ఉండొచ్చనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే ఈ ప్రకటనల్లో ఎక్కడా బీఆరెస్స్ ఎన్నికల గుర్తు "కారు" కనిపించకపోయినా... ప్రతీపేజీలోనూ కేసీఆర్ ఫుల్ కటౌట్ ఫోటోలు మాత్రం వివిధ స్టిల్స్ లో కనిపించాయి! మరి అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ ఇస్తున్న ఈ స్థాయి ప్రకటన ప్రభావం తెలంగాణ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే వేచి చూడాలి!
కాగా.. గతంలో తొలిసారి ముఖ్యమంత్రి అయిన అనంతరం.. తెలంగాణ పత్రికల్లో ఆంధ్ర వార్తలు కనిపించడం కానీ, ఆంధ్ర నాయకుల ఫోటోలు కనిపించడం కానీ జరగకూడదని కేసీఆర్ హుకుం జారీ చేసిన సంగతి తెలిసిందే!