అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో సీఎం జగన్...దేశంలోనే ఫస్ట్

Tue Nov 29 2022 20:50:45 GMT+0530 (India Standard Time)

CM Jagan is the first in the country in the strictest security

ఏపీ సీఎం వైఎస్ జగన్ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్ళిపోతున్నారు. సీఎం జగన్ భద్రత కోసం అత్యాధినిక పరికరాలను ఉపయోగిస్తున్నారు. దాదాపుగా రెండు కోట్ల రూపాయల ఖర్చుతో సీఎం భద్రతా ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.సీఎం నివాసానికి వెళ్లేటపుడు ఉండే చెక్ పోస్టులు ఇక మీదట కనిపించవు. వాటితో సంబంధం లేకుండా పూర్తి ఆధునిక సాంకేతిక పరిజ్ణానంతో టైర్ కిల్లర్స్ బొల్లార్డ్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. సీఎం ఇంటి వద్ద ఇప్పటిదాకా 45 సీసీ కెమెరాలు ఉంటే వాటిని ఏకంగా 65కి పెంచేశారు.

సీఎం నివాసం వద్ద  భద్రతా పరికరాల ఏర్పాట్ల వ్యవహారాన్ని ప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ఇపుడు ఈ భద్రతకు సంబంధించి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. మరో రెండు రోజులలో ప్రభుత్వ భద్రతా అధికారుల చేతులల్లోకి ఈ సాంకేతిక పరికరాలు వస్తాయి.

ఒక ముఖ్యమంత్రిని ఇంతటి సెక్యూరిటీ అవసరమా అన్న చర్చ రావచ్చు. అయితే ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉన్న ప్రాంతం అతి సున్నితమైనది అని అధికారులు తెలియచేస్తున్నారు. ఆ   ప్రాంతం  వెంబడే జాతీయ రహదారి చెన్నై-కోల్కటా ఉంది. అలాగే ఆయన ఇంటి పక్కనే రైవస్ కాలువ ఉంది. ఈ పరిణామాలను చూసుకునే భద్రతను పూర్తిగా టైట్ చేశారు. ఇరవై నాలుగు గంటల పాటు సెక్యూరిటీ అలెర్ట్ గా ఉంటుంది.

సీఎం నివాసం వైపు అల్లరి మూకలు కానీ అసాంఘిక శక్తులు కానీ చొచ్చుకువచ్చే ప్రయత్నం చేయకుండా అత్యంత కట్టుదిట్టమైన తీరులో ఈ భద్రతను అధికారులు అనుక్షణం పరిశీలిస్తారు. దేశంలో ఫస్ట్  టైం అన్నట్లుగా ఎక్కడా లేని విధంగా రెండు కోట్ల రూపాయలను వెచ్చించి మరీ భద్రతా పరికరాలు కొనుగోలు చేశారు అని అంటున్నారు.

మొత్తం మీద చూసుకుంటే జగన్ ఇంటి పరిసరాలు పూర్తిగా భద్రతా వలయంలో ఉంటాయని చెప్పాలి. అక్కడ చీమ చిటుక్కుమంటే చాలు సీసీ కెమెరాలు పట్టేసాయి. అక్కడ అన్ని రకాలుగా ఉన్న టైట్ సెక్యూరిటీ రెప్ప వాల్చకుండా కాపలా ఉంటుంది. ఇంతటి పటిష్టమైన భద్రత మధ్య జగన్ తన అధికారిక కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. మరి రానున్నది ఎన్నికల సీజన్. పైగా జగన్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధికారంలో ఉన్న వారి మీద అందరి కళ్ళూ ఉంటాయి. అందువల్లనే ఇంతటి భద్రత పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.