ఎంత జగన్ అయితే మాత్రం సీఎం హోదాలో వస్తే.. తిరుపతిలో అలాంటి సీనా?

Wed Sep 28 2022 11:04:36 GMT+0530 (India Standard Time)

CM Jagan Trip Tirumala Tirupati Temple

ముఖ్యమంత్రి అంటే ఎవరు? ప్రజలు ఎన్నుకున్న రాష్ట్రాధినేత. అంటే.. ప్రజలతోమమేకమై.. వారి ఇష్టంతో.. వారి అభిమానంతో అధికారంలోకి వచ్చిన ఒక ప్రజానేత. అలాంటి అధినేత తిరుపతి లాంటి అథ్యాత్మిక పట్టణంలోకి వచ్చినప్పుడు ఆంక్షల అస్త్రాన్ని సంధించాల్సిన అవసరం ఉందా? అన్నది ప్రశ్న. ఎంత ముఖ్యమంత్రి అయితే మాత్రం.. తిరుపతికి వచ్చిన జగన్ కోసం అధికారులు చేసిన ఏర్పాట్లు 'అతి'కి మించిన రీతిలో ఉండటం గమనార్హం.తాజాగా తిరుపతి పర్యటన సందర్భంగా ఆయన ప్రయాణించే మార్గాల్లోని దుకాణాలను మూసి వేయటం.. రోడ్ల ఆరంభంలో కు బ్యారికేడ్లను ఏర్పాటు చేయటం ఒక ఎత్తు అయితే.. మరో అడుగు ముందుకు వేసి.. ఇళ్లల్లో ఉన్న వారు సైతం.. సీఎం వచ్చే సమయంలో ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఆంక్షల్ని విధించిన వైనం షాకింగ్ గా మారింది.

మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి 6.35 గంటల వరకు సీఎం జగన్ రాక సందర్భంగా తిరుపతిలోని పలు ప్రాంతాల్లో రాకపోకల్ని నిలిపివేయటం గమనార్హం. అంతేకాదు ఆయన వెళ్లే మార్గాల్లో ట్రాపిక్ ఆంక్షల్ని విధించారు. అంతేకాదు.. కొన్ని కూడళ్లలో గంటకు పైగా రాకపోకల్ని ఆపేస్తే.. మున్సిపల్ కార్యాలయం కూడలి.. తుడా రోడ్డులో వాహనాల్ని పూర్తిగా నిషేధించటం గమనార్హం.

తాతయ్యగుంట ఆలయ పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి.. మంగళవారం ఉదయం నుంచే షాపుల్ని మూసేసి ఉంచటం ఒక ఎత్తు అయితే.. సాధారణ ప్రజానీకాన్ని సైతం ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఆంక్షల్నివిధించటంపై పలువురు మండిపడుతున్నారు.

తిరుపతి గ్రామదేవత గంగమ్మ ఆలయంలోనవరాత్రి ఉత్సవాలు ఆరంభం కాగా.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సామాన్యులకు దర్శనాల్ని ఆపేయటాన్నిపలువురు తప్పు పడుతున్నారు. ఎంత ముఖ్యమంత్రి వస్తుంటే మాత్రం.

ఇలాంటి ఆంక్షలు తామెప్పుడూ చూడలేదంటున్నారు. ఏమైనా ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటన ఏమో కానీ.. తిరుపతి ప్రజలకు మాత్రం చుక్కలు కనిపించాయన్న మాట మాత్రం పలువురి నోట వినిపించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.