Begin typing your search above and press return to search.

జూనియర్ అయ్యన్నకు సీఐడి ప్రశ్నల వర్షం

By:  Tupaki Desk   |   30 Jan 2023 9:12 PM GMT
జూనియర్ అయ్యన్నకు సీఐడి ప్రశ్నల వర్షం
X
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ పాత్రుడుని సీఐడీ అధికారులు పూర్తి స్థాయిలో విచారించినట్లుగా సమాచారం అందుతోంది. వారు ఆయన్ని అనేక రూపాలలో ప్రశ్నల వర్షం కురిపించారని అంటున్నారు. భారతి పే యాప్ ఎవరిది ఎవరు దీన్ని డిజై చేశారు. దీని వెనక అర్ధం పరమార్ధం ఏంటి ఇలా చాలా ప్రశ్నలను విజయ్ పాత్రుడు ఎదుర్కొన్నారు.

అసలు ఇలాంటి యాప్ ని రూపొందించాలన్న ఆలోచన ఎలా వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి ని ఎందుకు టార్గెట్ చేశారు అని అడిగినట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం యువ నేత నారా లోకేష్ తో ఉన్న సంబంధం ఏంటి అని కూడా గుచ్చి గుచ్చి అడిగినట్లుగా చెబుతున్నారు. ఈ యాప్ ద్వారా ఇప్పటిదాకా పెట్టిన పోస్టుల గురించి వాటి మీద వచ్చిన కేమ్నెంట్స్ గురించి కూడా విజయ్ ని గట్టిగానే అడిగారని అంటున్నారు.

ఇదిలా ఉంటే విజయ్ మీద గత ఏడాది సెప్టెంబర్ లో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ తరువాత ఆయనను విచారించడానికి ఈ నెల 27న తమ కార్యాలయానికి హాజరు కమ్మని కూరారు. అయితే ఆ రోజు తనకు వేరే పని ఉంద్దని ఈ రోజుకు విజయ్ హై కోర్టు ఆదేశాల మేరకు వచ్చారని అంటున్నారు. ఆయన వెంట న్యాయవాదులు కూడా సీఐడీ విచారణకు హాజరు కావచ్చని హై కోర్టు పేర్కొంది. దాంతో ఈ రోజు విజయ్ విజయవాడలోని సీఐడీ ఆఫీసుకు చేరుకున్నారు.

సీఐడీ ఆఫీసు దాకా మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు వంటి వారు వచ్చారు. అయితే వారిని లోపలికి రాకూడదు అంటూ సీఐడీ అధికారులు అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే దీని మీద తెలుగుదేశం నాయకులు మండిపడ్డారు. ఇంతకు రెండు రోజులు ముందే కడప ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్ లో సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హజరైనపుడు ఆయన వెంట ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి కోరుముట్ల శ్రీనివాసులు అనుచరులు వచ్చారని గుర్తు చేస్తున్నారు.

వారికి లేని ఇబ్బంది ఇక్కడ తమకు ఏంటి అని వారు అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసు విషయంలో పట్టుదలగా ఉన్న జగన్ ప్రభుత్వం ఎట్టకేలకు అయ్యన్న కుటుంబం నుంచి జూనియర్ పాత్రుడిని సీఐడీ అధికారుల ముందు విచారణకు కూర్చోబెట్టడంలో సక్సెస్ అయింది అని అంటున్నారు. జగన్ అధికారంలోకి రావడంతోనే మాజీ మంత్రి అయ్యనంపాత్రుడు ఒక వైపు నుంచి విజయ్ మరో వైపు నుంచి గట్టిగానే తగులు కుంటున్నారు.

ఏపీలో ఏ తెలుగుదేశం నాయకుడు సైతం విమర్శించనంత ఎక్కువగా వీరు విమర్శలు చేయడంతో జగన్ సర్కార్ కి టార్గెట్ అయ్యారు. అయితే నాలుగేళ్ల కాలంలో ఎందరో టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన జగన్ సర్కార్ అయ్యన్న ఫ్యామిలీ విషయంలో మాత్రం ఫెయిల్ అయిందనే అంటున్నారు. మొత్తానికి విజయ్ పాత్రుడుని విచారణ దాకా తీసుకువచ్చారని అంటునారు. ఇపుడు విజయ్ చెప్పిన సమాధానం తమ వద్ద ఉన్న ఆధారాలతో ఏమి చేస్తారు అన్న ఉత్కంఠ అయితే ఉంది మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.