Begin typing your search above and press return to search.

ఇన్ సైడర్ పై సీఐడీ కేసు: బుక్కైన టీడీపీ మాజీ మంత్రులు

By:  Tupaki Desk   |   23 Jan 2020 9:58 AM GMT
ఇన్ సైడర్ పై సీఐడీ కేసు: బుక్కైన టీడీపీ మాజీ మంత్రులు
X
3 రాజధానుల ప్రక్రియకు మండలిలో బ్రేక్ పడిన నేపథ్యంలో అమరావతిపై పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వం దృష్టిసారించింది. అమరావతి పేరిట భూములు కొని లాభపడ్డ వారి గుట్టు రట్టు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణను వేగవంతం చేసింది.

తాజాగా అసెంబ్లీలో హోంమంత్రి సుచిరిత ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరుపుతామని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే సీఐడీ రంగంలోకి దిగింది. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ పై కేసు నమోదు నమోదు చేశారు సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి. గుంటూరు జిల్లా మంగళగిరి టౌన్ పోలీసు స్టేషన్ లో ఈ మేరకు ఇన్ సైడర్ ట్రేడింగ్ లో భాగంగా అక్రమంగా భూములు కొల్లగొట్టిన మాజీ మంత్రులు నారాయణ ,పత్తిపాటి పుల్లారావు , బెల్లంకొండ నరసింహాలపై కేసునమోదు చేసినట్లు సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు.

అమరావతి రాజధాని ప్రకటనకు ముందే మభ్యపెట్టి తనభూమి కొనుగోలు చేసారని వెంకటాయపాలెం దళిత మహిళ పోతురాజు బుజ్జి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్టు సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. తమ విచారణలో 0.99 సెంట్లు కొనుగోలు చేసినట్టు విచారణలో వెల్లడైందని తెలిపారు. 420 ,506 ,120b, ఐపీసీ సెక్షన్ 3 కింద మాజీ మంత్రులపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.

ఇక సీఐడీ విచారణలో వెలుగులోకి ఆసక్తికర విషయాలు వచ్చినట్టు సమాచారం. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ లో దాదాపు 797 తెల్లరేషన్‌కార్డు హోల్డర్స్‌ భూములు కొన్నట్టు నిర్ధారణ అయినట్లు.. రూ.3 కోట్లకు చొప్పున ఎకరం భూమి తెల్లరేషన్‌కార్డు హోల్డర్స్ కొనుగోలు చేసినట్టు సీఐడీ గుర్తించిందని సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. రూ.220 కోట్లతో భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. తెల్లరేషన్ కార్డు హోల్డర్స్‌తో కొనుగోలు చేయించిన వారి వివరాలపై ఆరాతీస్తున్నామని వివరించారు.

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసామని సీఐడీ ఎస్పీ తెలిపారు. అమరావతిలో 129 ఎకరాలు 131 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్స్‌ కొనుగోలు చేసారని ఆమె వివరించారు. పెద్దకాకాని లో 40 ఎకరాలు 43 మంది తెల్లరేషన్‌ కార్డు దారులు కొన్నారన్నారు. తాడికొండలో 190 ఎకరాలు 188 మంది తెల్లరేషన్‌ కార్డు దారులు రిజిస్టర్ చేసుకొన్నారని వివరించారు. తుళ్లూరులో 242 ఎకరాలు 238 మంది తెల్లరేషన్‌ కార్డు కొన్నారన్నారు. మంగళగిరిలో 133 ఎకరాలు 148 మంది తెల్లరేషన్‌ కార్డు కొన్నారని తెలిపారు. తాడేపల్లిలో 24 ఎకరాలు 49 మంది తెల్లరేషన్‌ కార్డు దారులు కొన్నారని వెల్లడించారు.

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ ను వేగవంతం చేస్తామని.. త్వరలోనే నిజాలు నిగ్గుతేలుస్తామని సీఐడీ ఎస్పీ తెలిపారు.