Begin typing your search above and press return to search.

సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ సడెన్ బదిలీ.. ప్రమోషనా.. డిమోషనా...?

By:  Tupaki Desk   |   24 Jan 2023 9:14 AM GMT
సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ సడెన్  బదిలీ.. ప్రమోషనా.. డిమోషనా...?
X
అనూహ్యంగా ఏపీ సీఐడ్ చీఫ్ పీవీ సునీల్ కుమార్ ని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సడెన్ గా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో మరో సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ ని కొత్త సీఐడీ చీఫ్ గా ప్రభుత్వం నియమించింది. ఇక సునీల్ కుమార్ కి ఏ పోస్టింగ్ ఇవ్వలేదు. తదుపరి ఉత్తర్వుల కోసం సాధారణ పరిపాలనా విభాగానికి ఆయన్ని నివేదించమని కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే సునీల్ కుమార్ ముఖ్యమంత్రి జగన్ కి అత్యంత సన్నిహితుడు అయిన అధికారిగా పేరు పడ్డారు. ఆయనను ఏరి కోరి కీలక స్థానంలో నియమించారు అని ప్రచారంలో ఉంది. 2019లో జగన్ సర్కార్ అధికారంలోకి రాగానే ఆయనని తీసుకున్నారు. ఆయన గత నాలుగేళ్ళుగా విధి నిర్వహణలో ఉన్నా అనేక వివాదాలను కూడా వెంట తెచ్చుకున్నారు అని చెప్పాల్సి ఉంటుంది.

ముఖ్యంగా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు విషయంలో ఆయన ఆరోపణలు గురి అయ్యారు. రఘురామ మీద దేశ ద్రోహం కేస్దు పెట్టడం అత్యంత వివాదస్పదం అయింది. అలాగే తెలుగుదేశం పార్టీ నేతల మీద అనేక కేసులను సీఐడీ చీఫ్ గా సునీల్ కుమార్ పెట్టారు. ఇక అమరావతి భూ కుంభకోణం లో కూడా ఆయన కేసులు పెట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు మరో వివాదంగా మారింది.

వీటికి తోడు అన్నట్లుగా అనేక మీడియా సంస్థల మీద కూడా ఆయన కేసులు పెట్టడం సైతం వివాదమేకాదు విమర్శల పాలు అయింది. ఎన్ని చేసినా అయన వెనక జగన్ ఉన్నారని ఆయన సీఎం పేషీకి సన్నిహితమైన అధికారి అని అంతా అనుకునే వారు

అలాంటి అధికారి విషయంలో అనూహ్యంగా ఏ పోస్టింగ్ ఇవ్వకుండానే బదిలీ చేయడం ఇపుడు చర్చకు తావిస్తోంది. 1996 బ్యాచ్ కి చెందిన సునీల్ కుమార్ కు ఈ మధ్యనే డైరెక్టర్ జనరల్ హోదాలో పదోన్నతి లభించింది. ఇంతలోనే ఆయన ఆకస్మిక బదిలీ సైతం షాక్ కి గురి చేసేలా ఉంది.

ఇదిలా ఉంటే ఆయన ఏపీకి కాబోయే డీజీపీ అని కూడా ప్రచారంలో ఉంది. మరే కీలకమైన పదవి కోసం ఆయన్ని ఏపీ సీఐడీ చీఫ్ నుంచి తప్పించారో అన్న చర్చ కూడా నడుస్తోంది. ఏ విషయం మాత్రం బయటపడడంలేదు. ఒకవేళ ఆయనను పనిష్ మెంట్ బదిలీ చేస్తే మాత్రం అది సంచలనమే అవుతుంది. మరి ఆ పనిష్ మెంట్ కి కూడా కారణాలు ఏమై ఉంటాయి అన్నది కూడా చూడాల్సి ఉంటుంది.

ఇక ఆయన ప్లేస్ లో కొత్త చీఫ్ గా వచ్చిన ఎన్ సంజయ్ కూడా 1996 బ్యాచ్ కి చెందిన అధికారి కావడం విశేషం. ఇప్పటిదాకా ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తున్న సంజయ్, ప్రస్తుత పోస్టింగ్‌ను పూర్తి అదనపు బాధ్యతగా కొనసాగిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.