Begin typing your search above and press return to search.

వివేకా హత్య కేసు… తెరపైకి నిన్‌ హైడ్రిన్‌ పరీక్ష!

By:  Tupaki Desk   |   7 Jun 2023 6:14 PM GMT
వివేకా హత్య కేసు… తెరపైకి నిన్‌ హైడ్రిన్‌ పరీక్ష!
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు లో కీలకంగా మారిన వివేకా రాసార ని చెబుతున్న లేఖ పై వేలిముద్రల ను గుర్తించడం కోసం నిన్‌ హైడ్రిన్ అనే ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది.

తాజాగా వివేకా హత్యకేసు లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందు లో భాగంగా... నిన్‌ హైడ్రిన్ అనే ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించేందు కు సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది. ఒరిజినల్‌ లేఖ ను కోర్టుకు సమర్పించి.. అవసరమైనన్ని సర్టిఫైడ్‌ కాపీలు తీసి పెట్టుకోవాల ని సీబీఐ కి కోర్టు తెలిపింది. ఒకవేళ నిన్‌ హైడ్రిన్‌ పరీక్షలో ఒరిజినల్‌ లేఖ దెబ్బతిన్నట్టయితే సర్టిఫైడ్‌ కాపీని సాక్ష్యంగా సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.

వివేకా హత్య జరిగిన చోట లభ్యమైన లేఖ పై ఇప్పటికే పలు అనుమానాలు రేకెత్తిన సంగతి తెలిసిందే! ఆ లేఖ వివేకా రాసిందేనా? లేక, ఎవరైనా రాశారా? ఆయనే ఒత్తిడి లో రాశారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అయితే డ్రైవర్‌ ప్రసాద్‌ హత్య చేసినట్టు హత్యా స్థలిలో ఆరోజున లభించిన లేఖ ను కడప కోర్టు ద్వారా సీబీఐ 2021లో తీసుకుంది. అనంతరం అదే ఏడాది ఫిబ్రవరి 11న ఢిల్లీ లోని సీ.ఎఫ్‌.ఎస్‌.ఎల్‌.కు సీబీఐ పంపించింది.

అయితే ఈ లేఖ పై పరిశోధన జరిపి విశ్లేషించిన సీ.ఎఫ్‌.ఎస్‌.ఎల్‌... అప్పటికే వివేకా రాసిన ఇతర పత్రాల తో పోల్చి చూసింది. అనంతరం ఒక క్లారిటీ కి వచ్చి... అది వివేకా రాసిందేనని, అయితే తీవ్ర ఒత్తిడి లో రాసినట్లు ఉందని సీబీఐ కి నివేదిక ఇచ్చింది. అయితే ఆ లేఖ ను బలవంతంగా రాయించినట్టు అప్రూవర్‌ గా మారిన దస్తగిరి చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఆ లేఖ పై ఉన్న వేలిముద్రలు గుర్తించి నివేదిక ఇవ్వాలని సీ.ఎఫ్‌.ఎస్‌.ఎల్‌.ను సీబీఐ కోరింది.

దీంతో... లేఖ పై వేలిముద్రలు గుర్తించాలంటే నిన్‌ హైడ్రిన్‌ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుందని ఫోరెన్సిక్‌ నిపుణులు సీబీఐ కి తెలిపారు. అయితే.. ఈ పరీక్ష నిర్వహించే క్రమం లో లేఖ దెబ్బతినొచ్చని పేర్కొంది. అధికారులు సీబీఐ కోర్టును ఆశ్రయించారు.. నిన్ హైడ్రిన్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో... తాజాగా ఈ రిక్వస్టుకు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. దీంతో... ఈ కేసు లో ఇదొక కీలక పరిణామం అని అభిప్రాయపడుతున్నారు పరిశీలకులు.