Begin typing your search above and press return to search.

వివేకా హత్య కేసు.. సీబీఐ ముందుకు జగన్‌ ఇద్దరు సన్నిహితులు!

By:  Tupaki Desk   |   3 Feb 2023 3:31 PM GMT
వివేకా హత్య కేసు.. సీబీఐ ముందుకు జగన్‌ ఇద్దరు సన్నిహితులు!
X
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ వేగం పుంజుకుంది. వివేకా కుమార్తె సీబీఐ విచారణను ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి మార్చాలని.. విచారణ వేగవంతమయ్యేందుకు ఇది తప్పనిసరి అని సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఆమె విన్నపం మేరకు సుప్రీంకోర్టు వైఎస్‌ వివేకా హత్య కేసును ఏపీ నుంచి తెలంగాణకు మార్చింది. దీంతో సీబీఐ ఈ హత్య కేసు విచారణలో వేగం పెంచింది.

ఇప్పటికే కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని సీబీఐ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌ లో విచారించింది. అవినాష్‌ రెడ్డి ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా జగన్‌ భార్య భారతి ఇంట్లో పనిచేసే నవీన్, సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డిలకు సీబీఐ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నవీన్, కృష్ణమోహన్‌ రెడ్డి కడప కేంద్ర కారాగారంలో సీబీఐ విచారణకు హాజరయ్యారు.

కాగా జనవరి 28న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని నాలుగున్నర గంటలపాటు విచారించిన సీబీఐ.. ప్రధానంగా ఆయన కాల్‌డేటాపై ఆరా తీసిందని వార్తలు వచ్చాయి. నవీన్‌ అనే వ్యక్తి పేరిట ఉన్న మొబైల్‌ నంబర్‌కు అవినాష్‌ ఎక్కువగా కాల్‌ చేసి మాట్లాడినట్లు దర్యాప్తులో సీబీఐ గుర్తించినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ ఇంట్లో పనిచేసే నవీన్‌ తోపాటు సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది.

కాగా ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఎర్రగంగిరెడ్డి, అప్రూవర్‌గా మారిన డ్రైవర్‌ దస్తగిరి, రిమాండు ఖైదీలుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి, ఉమాశంకర్‌ రెడ్డి, సునీల్‌యాదవ్‌ లను ఫిబ్రవరి 10న విచారణకు హైదరాబాద్‌కు రావాలని సీబీఐ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.