ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: కేసీఆర్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ

Mon Feb 06 2023 12:28:13 GMT+0530 (India Standard Time)

CBI MLA purchase case High Court verdict is a big shock to KCR Govt

బీజేపీపై పోరాడుతున్న కేసీఆర్ కు కాలం కలిసిరాలేదని బీఆర్ఎస్ శ్రేణులు నిట్టూరుస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీని ఇరుకునపెట్టాలని చూసిన కేసీఆర్ కు న్యాయస్థానంలో చుక్కెదురైందన్న చర్చ సాగుతోంది. తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. కేసును సీబీఐకి అప్పగించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్లను హైకోర్టు కొట్టివేసింది. సీబీఐకి అప్పగిస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తప్పుబట్టలేమని అందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.మరోవైపు హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉందని.. తీర్పును 15 రోజుల పాటు అమలు చేయకుండా చూడాలని సీజే ధర్మాసనాన్ని అడ్వకేట్ జనరల్ కోరారు. అయితే దానికి హైకోర్టు నిరాకరించింది.

 దీంతో ఈ కేసులో బీజేపీకి అనుకూలంగా కాగా.. కేసీఆర్ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఈ విషయంలో కేసీఆర్ ఎలాంటి ముందడుగు వేస్తారు? సుప్రీంకోర్టుకు వెళతారా? అన్నది ఆసక్తి రేపుతోంది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. సిట్ తోపాటు ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తును కూడా హైకోర్టు రద్దు చేసింది.

సింగిల్ జడ్జి తీర్పుపై కేసీఆర్ ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు అప్పీలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ జస్టిస్ ఎన్ తుకారాం ధర్మాసనం అప్పీల్ పై సుధీర్ఘ విచారణ జరిపి తీర్పు రిజర్వు చేసింది.

తాజాగా సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా తీర్పు వెలువరించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.