Begin typing your search above and press return to search.

రిటైర్మెంట్ ఎమోషన్... బస్సుపై పిచ్చి ప్రేమ!

By:  Tupaki Desk   |   2 Jun 2023 1:03 PM GMT
రిటైర్మెంట్ ఎమోషన్... బస్సుపై పిచ్చి ప్రేమ!
X
ఎమోషన్స్ కి పరామితులు ఏమి ఉంటాయి.. బంధం పెనవేసుకుపోవడానికి మనిషి - వస్తువు అనే వ్యత్యాసాలేమి ఉంటాయి? అందుకే చిన్న చిన్న పెన్నూ, పెన్సిల్ పోయినా కూడా ఇవి పలనా వాళ్ల గుర్తుగా దాచుకున్నామని చాలామంది చెబుతుంటారు. ఇక ఇంట్లో పెంపుడు జంతువుల విషయనికొస్తే.. పిల్లలతో సమానంగా చూసేవారు కోకొళ్లలు.

ఇక వాహనాల విషయంలోనూ చాలా మంది ఇదే అటాచ్ మెంట్ చూపిస్తుంటారు. అయితే... తాజాగా తాను ఇంతకాలం పనిచేసిన బస్సుతో తీవ్రస్థాయిలో అటాచ్ మెంట్ పెట్టుకుని, రిటైర్మెంట్ వేళ ఎమోషన్ అవుతున్నారు ఒక డ్రైవర్.

తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థలో ముత్తుపాండి అనే వ్యక్తి చాలా కాలంగా డ్రైవర్ గా పనిచేస్తున్నారు. బస్సును ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు. ఈ సమయంలో ఎంతో కాలంగా తను నడిపిన సంస్థ బస్సుపై విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు. అయితే తాజాగా అతనికి పదవీ విరమణ పొందాల్సిన సమయం వచ్చింది. దీంతో... ఎంతో కాలంగా తాను నడిపిన సంస్థ బస్సును పట్టుకుని ఎమోషన్ అవుతున్నాడు.

అవును... పదవీవిరమణ సందర్భంగా ముత్తుపాండి చివరిసారిగా ఆ బస్సును చూసుకుంటూ కన్నీరు పెట్టాడు. ఇక ఈ బస్సుతో తనకున్న రుణం తీరిపోయిందని, బంధం తెగిపోయిందనే మాటను తలచుకుంటూ స్టీరింగ్ ను ముద్దాడి, క్లచ్, గేర్, బ్రేక్.. ఇలా అన్నింటినీ ఆత్మీయంగా, ఆప్యాయంగా తడుముతూ, బస్సు ఫుట్ బోర్డుకు సైతం నమస్కరిస్తూ బస్సులోంచి కిందికి దిగారు ముత్తుపాండి.

ఆ తర్వాత బస్సు ముందర ఉండే రూటు బోర్డుకు దండం పెట్టి ముద్దు పెట్టుకుని, బస్సును ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకొని కంటతడి పెట్టుకున్నాడు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ముత్తుపాండిపై ప్రశంసల జల్లులు కురిపిస్తూ... హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అని విష్ చేస్తున్నారు.