Begin typing your search above and press return to search.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు.. ధర ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   7 Feb 2023 7:00 AM GMT
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు.. ధర ఎంతో తెలుసా?
X
ఫ్రెంచ్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బుగట్టి ఒక రికార్డు సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారును వేలం  వేసి కల్లు చెదిరే ధరను పొందింది..  బుగాట్టి చిరోన్ ప్రొఫైల్‌ కారుకు ఈ అత్యధిక ధర దక్కింది. ఒక బడాబాబు  వేలంలో $10.76 మిలియన్లకు కొనడం ద్వారా కొత్త రికార్డును నెలకొల్పాడు. ఇది రూ. 87 కోట్లకు పైగా ఉంది. దీంతో బుగాట్టి  "అత్యంత ఖరీదైన కొత్త కారుగా వేలంలో రికార్డు ధర పలికింది. ఇదో ప్రపంచ రికార్డు గా చెప్పొచ్చు. ఈ మేరకు బుగాట్టి సీఈవో మేట్ రిమాక్ వివరాలు వెల్లడించాడు.

ధర, పన్నులతో కలిపి ఈ కారు ధర $13.1 మిలియన్లకు పైగా పెరిగింది. ఫిబ్రవరి 1న వేలం నిర్వహించారు.

కారును కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. కొనుగోలుదారుల గుర్తింపును హైడ్ చేశారు. అమ్మకంలో కొంత శాతం అనేక స్వచ్ఛంద సంస్థలకు వెళుతుంది.  రిమాక్ 2021 చివరిలో స్టీఫన్ వింకెల్‌మాన్ నుండి కంపెనీ పాలనను స్వీకరించారు. ఇతడే ఈ అరుదైన కార్లకు వేలం రికార్డులు బద్దలు కొట్టిస్తున్నాడు.

బుగట్టి చిరోన్ కారు ప్రొఫైల్ చూస్తే మొత్తం 1,479 హార్స్‌పవర్ ,  1,180 lబీ-ఎఫ్టీ టార్క్‌తో 8.0-లీటర్ క్వాడ్-టర్బో డబ్ల్యూ16 ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది చిరోన్ పూర్ స్పోర్ట్ మాదిరిగానే అదే కేటగిరికి చెందింది. ఈ విభాగంలో కేవలం 60 మాత్రమే కార్లు తయారు చేయబడ్డాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.