Begin typing your search above and press return to search.

టీడీపీ లో మరో ముసలం.. కేశినేని నాని పై బుద్ధా సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   9 Jun 2023 6:21 PM GMT
టీడీపీ లో మరో ముసలం.. కేశినేని నాని పై బుద్ధా సంచలన వ్యాఖ్యలు!
X
ఏపీ లో ఎన్నికల కు ఇంకా 9 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ సమయం లో కలసికట్టుగా సాగాల్సిన ప్రతిపక్ష టీడీపీ నేతలు అభిప్రాయ భేదాల తో రోడ్డు ఎక్కుతున్నారు. ఇటీవల పల్నాడు జిల్లా సత్తెనపల్లి, చిలకలూరి పేటల్లో అభ్యర్థుల ఎంపిక పై కోడెల శివరామ్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీ అధిష్టానం పై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఎప్పటి నుంచో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని సందర్భం వచ్చిన ప్రతిసారీ టీడీపీ అధిష్టానం పై, తన వైరివర్గం నేతల పై కారాలు మిరియాలు నూరుతున్నారు. తాజాగా కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో కేశినేని నాని వ్యాఖ్యల పై విజయవాడ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు.

తనను ఎవరేం విమర్శించినా తొందరపడనని చంద్రబాబు కు మాటిచ్చానని తెలిపారు. కాబట్టే కేశినేని నాని వ్యాఖ్యల పై ఇప్పుడేం స్పందించనని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న వెల్లడించారు. ఆయన ఒక మాట అన్నాడని.. తాను కూడా ఒక మాట అంటే పార్టీకి నష్టమన్నారు. అందువల్లే తాను మాట్లాడటం లేదని తెలిపారు. కేశినేని నాని వ్యాఖ్యల ను అధిష్ఠానం చూసుకుంటుందని తెలిపారు.

బీసీ నాయకుడి అయిన తన ను కేశినేని నాని ఎన్నోసార్లు అవమానించారని కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ నాని గారంటూనే కేశినేని నాని ని సంబోధిస్తాను అని పేర్కొన్నారు. కేశినేని నాని తన ను ఎన్ని సార్లు అవమానించిన సైలెంటు గా ఉన్నానని గుర్తు చేశారు. నాని వ్యాఖ్యల ను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. నాని తో తన కు భేదాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవమేనని తెలిపారు.

ఈ భేదాభిప్రాయాల వల్లే విడి గా ఉంటున్నామని వెల్లడించారు. గతం లో కేశినేని నాని పై తాను చేసిన వ్యాఖ్యలు పొరపాటేనని.. ఈ విషయాన్ని తాను గతం లోనే ఒప్పుకున్నానని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. కేశినేని నాని ని ఆ స్థాయిలో విమర్శించడం పై చంద్రబాబు తన పై అప్పట్లో కోప్పడ్డారని గుర్తు చేసుకున్నారు.

అవినాష్‌ రెడ్డి బెయిల్‌ రద్దు అంశం శుక్రవారం సుప్రీం కోర్టు లో ఉన్నందుకే జగన్‌ అర్ధాంతరంగా గుడివాడ పర్యటన రద్దు చేసుకున్నారని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. ఈసారి వైఎస్సార్‌ పై నుంచి వచ్చి ప్రచారం చేసినా గుడివాడ గొట్టంగాడు గెలవలేడని జగన్‌ కు అర్థమవ్వడం తోనే ఇక పర్యటన అనవసరం అనుకున్నారని బుద్ధా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవినాష్‌ రెడ్డి అరెస్టు పై సీబీఐ డొంకతిరుగుడు వైఖరి సరికాదని బుద్ధా వెంకన్న అభిప్రాయపడ్డారు. వైసీపీ గొట్టంగాళ్లంతా చంద్రబాబు కు ప్రాణహాని తలపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.