బుద్దా చిచ్చు రేపాడే.. విజయవాడలో టెన్షన్ టెన్షన్

Mon Jan 24 2022 19:00:01 GMT+0530 (IST)

Buddha Venkanna Comments On Kodali Nani

ఏపీ మంత్రి కొడాలి నాని 'క్యాసినో' వివాదాన్ని టీడీపీ వదిలిపెట్టడం లేదు. ఈ రగడను టీడీపీ రగిలిస్తూనే ఉంది. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య ఈ డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది.తాజాగా మంత్రి కొడాలి నాని డీజీపీ గౌతం సవాంగ్ పై టీడీపీ నేత బుద్దా వెంకన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి.  సోమవారం మీడియాతో మాట్లాడిన బుద్దా వెంకన్న.. మంత్రి కొడాలి నానితోపాటు డీజీపీని తీవ్రంగా విమర్శించారు.  ఓ సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు బెదిరింపుల వరకూ వెళ్లారు. ఆయన అలా కామెంట్స్ చేశారో లేదో.. పోలీసులు వేగంగా స్పందించారు.

బుద్దా చేసిన వ్యాఖ్యలు ఆరోపణలకు వివరణ ఇవ్వాలంటూ పోలీసులు విజయవాడలోని ఆయన నివాసానికి వెళ్లారు.దీంతో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేతలు బుద్దావెంకన్నపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

బుద్దవెంకన్న ఇంటికి పోలీసులు రావడంతో అక్కడికి భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని తేలడంతో టీడీపీ నేతలు అక్కడికి చేరుకుని అడ్డుకునేందుకు రెడీ అయ్యారు.

ఇప్పటికే 'క్యాసినో' వివాదంపై మంత్రి కొడాలి నాని స్పందించారు. చంద్రబాబు లోకేష్ టీడీపీ నేతలపై బూతులతో విరుచుకుపడ్డారు. దీనికి టీడీపీ నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ వివాదం రాజుకుంటోంది. టీడీపీ వైసీపీ నేతల పరస్పర విమర్శలతో హీట్ పెరుగుతోంది.