Begin typing your search above and press return to search.

అవును.. ఆ జట్టు 2 పరుగులకే అలౌట్ అయ్యింది

By:  Tupaki Desk   |   23 Jun 2021 8:30 AM GMT
అవును.. ఆ జట్టు 2 పరుగులకే అలౌట్ అయ్యింది
X
క్రికెట్ మ్యాచ్ అన్న తర్వాత బ్యాటింగ్ చేసే పదకొండు మంది బ్యాట్స్ మెన్లు అంతో ఇంతో పరుగులు తీస్తారు. ఎంత ఫెయిల్ అయినా కనీసం నాలుగైదు పరుగులు చొప్పున బ్యాట్స్ మెన్ చేయటం కనిపిస్తుంది. అందుకు భిన్నంగా పరుగులు అంటూ చేయకుండా క్రీజ్ లోకి వచ్చిన బ్యాట్స్ మెన్లు ఆలౌట్ కావటం ఎప్పుడైనా జరిగిందా? అంటే.. వెంటనే సమాధానం చెప్పలేం. కానీ.. తాజాగా ఆ విచిత్రం ఇంగ్లండ్ లో చోటు చేసుకుంది.

కౌంటీ లీగ్ లో చోటు చేసుకున్న ఈ చిత్రం.. ప్రపంచ క్రికెట్ లో అనూహ్య పరిణామంగా చెబుతున్నారు. హంటింగ్డన్ షైర్ కౌంటీ లీగ్ లో పాల్కన్స్.. బక్ డెన్ క్రికెట్ క్లబ్ ల మధ్య తాజాగా మ్యాచ్ జరిగింది. తొలుత పాల్కన్స్ జట్టు 40 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి260 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన బక్ డెన్ జట్టు 8.3 ఓవర్లలో ఒక్క పరుగు అంటే ఒక్క పరుగు తీయకుండా బ్యాట్సెమెన్లు ఆలౌట్ అయ్యారు. ఒక్కటంటే ఒక్క పరుగు తీయకుండా క్రీజ్ లోకి వచ్చినోళ్లు వచ్చినట్లే వెళ్లిపోతే.. మరికొందరు కాసేపు ఉన్నా.. ఒక్క పరుగు కూడా తీయలేదు. అయితే.. వచ్చిన రెండు పరుగుల్లోనూ బౌలర్ల తప్పుల కారణంగా జట్టు స్కోర్ రెండు పరుగులైనా నమోదైంది. లేదంటే.. సున్నా పరుగులతో దారుణమైన రికార్డును సొంతం చేసుకొని ఉండేవారు. ఈ మ్యాచ్ ఫలితం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.దీంతో ఫాల్కన్స జట్టు రూ.258 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.