Begin typing your search above and press return to search.

ఆంక్షలు ప్రజలకే..పార్లమెంట్​ కు కాదు..ఏరులై పారుతున్న మద్యం!

By:  Tupaki Desk   |   29 Sep 2020 12:10 PM GMT
ఆంక్షలు ప్రజలకే..పార్లమెంట్​ కు కాదు..ఏరులై పారుతున్న మద్యం!
X
కరోనా సాకుతో బ్రిటన్​ లో బార్లు, క్లబ్బులు, పబ్బులకు అక్కడి ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు పెట్టింది. అయితే బ్రిటన్​ పార్లమెంట్​లోని బార్లకు మాత్రం ఈ ఆంక్షల నుంచి సడలింపులు ఇచ్చింది. దీంతో ఆంక్షలు సాధారణ ప్రజలకేనా.. ఎంపీలకు అక్కర్లేదా? అంటూ అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా లాక్​ డౌన్​ తో అన్ని దేశాల మాదిరిగానే బ్రిటన్​ లోనూ.. బార్లు, పబ్బులు, క్లబ్బులకు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో ఇటీవల అక్కడి ప్రభుత్వం కొన్ని ఆంక్షలతో బార్లు ఓపెన్​ చేసింది. అయినప్పటికీ ఆశించిన గిరాకీ రావడం లేదు. చాలా ఆంక్షల నడుమ బార్లు ఓపెన్​ చేశారు. రాత్రి 10 గంటల వరకే బార్లు ఓపెన్​ చేయాలి. 10 మంది కంటే ఎక్కువ జనం గుమికూడవద్దు. బార్​కు వచ్చిన వారందరి ఫోన్​ నంబర్లు సేకరించాలని నిబంధన పెట్టారు. దీంతో గిరాకీ పై తీవ్ర ప్రభావం పడింది.

ఆంక్షలు మాకేనా.. ఎంపీలు ఎమన్నా దిగోచ్చారా?

దేశవ్యాప్తంగా అన్ని బార్లకు ఆంక్షలు విధించిన ప్రభుత్వం పార్లమెంట్​ ఆవరణలోని బార్లకు మాత్రం నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంట్ ఆవరణలో మొత్తం 30 బార్లు ఉన్నాయి. అంతేకాక అర్ధరాత్రి 1 గంటవరకు బార్లు ఓపెన్​ చేయొచ్చు. అయితే బ్రిటన్​ పార్లమెంట్​లోని బార్లకు ఎంపీలు వాళ్ల చుట్టాలు వెళ్లవచ్చు. మరోవైపు జర్నలిస్టులను మాత్రమే అనుమతించే బార్లు కూడా కొన్ని ఉన్నాయి. ది లార్డ్స్‌ బార్, ది బిషప్స్‌ బార్, దీ పీర్స్‌ డైనింగ్‌ రూమ్, ది పీర్స్‌ గెస్ట్‌ రూమ్, ది పూజిన్‌ రూమ్, ది టెర్రేస్‌ పెవీలియన్, ది స్ట్రేంజర్స్‌ బార్, ది టెర్రేస్‌ కాఫెటేరియా, ది థేమ్స్‌ పెవీలియన్, ది స్పీకర్స్‌ స్టేట్‌ రూమ్స్, ది రివర్‌ రెస్టారెంట్, బెల్లమీస్, ది డిబేట్, ది జూబ్లీ రూమ్, ది అడ్జెర్న్‌మెంట్, ది మెంబర్స్‌ డైనింగ్‌ రూమ్, ది స్ట్రేంజర్స్‌ డైనింగ్‌ రూమ్, ది స్పోర్ట్స్‌ అండ్‌ సోషల్‌ బార్, ది ఇంటర్‌ పార్లమెంటరీ యూనియన్‌ రూమ్, ది చర్చిల్‌ రూమ్, ది కోల్‌మాండ్‌లే రూమ్, ది బెర్రీ రూమ్, ది హోం రూమ్, జూబ్లీ కేఫ్, ది అట్లీ రూమ్, మిల్‌బ్యాంక్‌ హౌజ్‌ కేఫ్‌టేరియా, ది రివర్‌ డైనింగ్‌ రూమ్స్, మాన్‌క్రీఫ్స్‌ వంటి పేర్లతో బ్రిటన్​ పార్లమెంట్​ ఆవరణలో బార్లు ఉన్నాయి. వీటిలో మాన్‌క్రీఫ్స్‌ జర్నలిస్టులకు ప్రత్యేకం.

ఈ బార్ల ప్రత్యేకతలు ఏమిటి?

ఇక్కడ చాలా తక్కువ ధరకే మద్యం దొరుకుతుంది. బాటిల్​ మీద ఇచ్చే సబ్సిడీని ప్రభుత్వమే బరిస్తుంది. కేవలం మూడు డాలర్లకు ఓ బీరు ఇక్కడ దొరుకుతుందట. ఫలితంగా ఏటా 8 మిలియన్‌ డాలర్ల సబ్సిడీ భారం ప్రజలపై పడుతోంది.

బ్రిటీష్​ ఎంపీలంతా తాగుబోతులే..!

బ్రిటన్​ పార్లమెంట్​ లో ఉండే ఎంపీలంతా తాగుబోతులేనని సర్వే తేల్చిచెబుతున్నది.
1980లో నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం బ్రిటిష్‌ ఎంపీల్లో ఎక్కువ మంది తాగే తాగేవారు. వారిలో 10 శాతం మంది తాగుడు మానేందుకు రీహాబిటేషన్​ సెంటర్లకు వెళతారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు పార్లమెంట్​ బార్లకు ఆంక్షలు సడలింపు ఇవ్వడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు మాత్రం ఆంక్షలు.. వారికైతే హద్దులేలేవా? అంటూ సోషల్​మీడియాలో ఎంపీలపై దుమ్మెత్తి పోస్తున్నారు.