Begin typing your search above and press return to search.

బై బై బోరిస్.. బ్రిటన్ ప్రధాని రాజీనామా.. కొత్త ప్రధాని భారతీయుడేనా? పాకిస్థానీనా?

By:  Tupaki Desk   |   7 July 2022 10:30 AM GMT
బై బై బోరిస్.. బ్రిటన్ ప్రధాని రాజీనామా.. కొత్త ప్రధాని భారతీయుడేనా? పాకిస్థానీనా?
X
కొవిడ్ కాలంలో ఆంక్షల అమలులో విమర్శలు ఎదుర్కొని.. ప్రజలంతా మహమ్మారితో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే విందు వినోదాల్లో మునిగిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పదవి నుంచి తప్పుకోనున్నారు. కొవిడ్ సమయంలో ఐసీయూ వరకు వెళ్లిన జాన్సన్.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అయితే, దేశంలో వైరస్ తీవ్రంగా ఉన్న సమయంలో ఆయన వ్యవహరించిన తీరు వివాదాస్పమైంది. లక్షలాది మందిని కొవిడ్ బలిగొన్నప్పటికీ ఆంక్షల అమలును ఎప్పుడు ఎత్తివేద్దామా? అని ఆలోచించారనే అపవాదును ఆయన మూటగట్టుకున్నారు. వీటన్నిటికీ తోడు లైంగిక‌ దుష్ర్ప‌వ‌ర్త‌న ఆరోప‌ణ‌ల గురించి తెలిసినా క్రిస్ పించ‌ర్‌ను డిప్యూటీ విప్‌గా నియ‌మించ‌డం ప‌ట్ల క‌న్జ‌ర్వేటివ్ ఎంపీలు జాన్స‌న్‌పై మండిప‌డుతున్నారు.

మంత్రులు రిషి సునక్‌, సాజిద్ జావిద్‌లు జాన్స‌న్ తీరును ఆక్షేపిస్తూ రాజీనామా చేయ‌డంతో ప‌లువురు మంత్రులు ఇదే బాట‌ప‌ట్టారు. ఇలా అనేక వివాదాల్లో చిక్కుకున్న బోరిస్‌ జాన్సన్‌కు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా బ్రిటన్‌లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని బోరిస్‌ను డిమాండ్ చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఇటీవల సొంత పార్టీ సభ్యులు వరుసగా రాజీనామాలు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాని పదవి నుంచి వైదొలిగేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా చేసేందుకు బ్రిటన్ ప్రధానమంత్రి అంగీకరించారు.

అయితే, క‌న్జ‌ర్వేటివ్ కొత్త నేత ఎన్నిక‌య్యే వ‌ర‌కూ బోరిస్ జాన్స‌న్ ప్ర‌ధానిగా కొన‌సాగుతారు. జాన్స‌న్ త‌న రాజీనామాను ధ్రువీక‌రించిన అనంత‌రం త‌దుప‌రి ప్ర‌ధానిని నిర్ణ‌యించేందుకు క‌న్జ‌ర్వేటివ్ నాయ‌క‌త్వ ఎన్నిక వివ‌రాలు వెల్ల‌డికానున్నాయి. కాగా, పించర్ పై వచ్చిన లైంగిక ఆరోపణలు 2019 నాటివి. అలాంటి ఆయనను కేబినెట్‌లో సీనియ‌ర్ స‌భ్యుడిగా జాన్స‌న్ నియ‌మించ‌డం బ్రిట‌న్‌లో దుమారం రేపింది. ఈ ఆరోప‌ణ‌ల విష‌యం జాన్స‌న్‌కు తెలియ‌ద‌ని జులై 1న బ్రిట‌న్ ప్ర‌భుత్వం పేర్కొంది. అయితే ఇది వాస్త‌వం కాద‌ని, ఈ ఆరోప‌ణ‌ల గురించి ప్ర‌ధానికి తెలుస‌ని ప్ర‌భుత్వ ప్రతినిధి పేర్కొన్నారు. ప్ర‌ధాని అస‌త్యం చెబుతున్నార‌ని 2015 నుంచి 2020 వ‌ర‌కూ విదేశాంగ కార్యాల‌యంలో సీనియ‌ర్ అధికారిగా ప‌నిచేసిన సైమ‌న్ మెక్ డొనాల్డ్ ఆరోపించ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆపై పించ‌ర్‌ను ప్ర‌మోట్ చేసే విష‌యంలో పొర‌పాటు జ‌రిగింద‌ని ప్ర‌ధాని జాన్స‌న్ అంగీక‌రించారు.

సునక్ సహా 50 మంత్రుల రాజీనామా

జాన్సన్ తీరుపై వ్యతిరేకతతో భారతీయ మూలాలున్న ఆర్థిక మంత్రి, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తికి అల్లుడైన రిషీ సునక్ సహా 50 మంది మంత్రులు తప్పుకోవడం గమనార్హం .వీరిలో కేవలం మూడు రోజుల కిందట మంత్రి పదవి పొందిన మిచెల్ డొనెలన్ కూడా ఉండడం గమనార్హం. బుధవారం సాయంత్రం వరకు 17 మంది క్యాబినెట్ మంత్రులు, 12 మంది పార్లమెంటరీ కార్యదర్శులు, నలుగురు విదేశీ ప్రభుత్వ ప్రతినిధులు రాజీనామాను ప్రకటించారు. బోరిస్ జాన్సన్ పాలనపై వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కరోనాను సరిగ్గా ఎదుర్కోలేకపోయారని, లాక్‌డౌన్ నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులుకు గురి చేశారని మండిపడుతున్నారు. అంతేకాదు బోరిస్ జాన్సన్‌ సెక్స్ స్కాండల్‌పై వస్తున్న ఆరోపణలను కూడా ప్రస్తావిస్తున్నారు. మంత్రులు, ఎంపీల నుంచి తీవ్రంగా ఒత్తిడి రావడంతో.. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని బోరిస్ నిర్ణయించుకున్నారు. దీంతో ప్రధాని బాధ్యతల నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. అయితే.. బోరిస్‌ రాజీనామా, తదుపరి ప్రధాని ఎవరనే విషయాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. బ్రిటన్ కొత్త ప్రధాని రేసులో మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ , విదేశీ కామన్ వెల్త్ అండ్ డెవలప్‌మెంట్ అఫైర్స్ సెక్రటరీ లిజ్ ట్రస్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

కొత్త ప్రధాని వచ్చేవరకు పదవి నుంచి తప్పుకోనున్న జాన్సన్ ఓ షరతు విధించినట్లు ప్రచారం జరుగుతోంది. కన్జర్వేటివ్ పార్టీ కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు.. తాను కొనసాగుతానని ఆయన కోరినట్లు సమాచారం. కాగా, కరోనా రిలీఫ్ ప్యాకేజీ కారణంగా సునక్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. ప్రధానమంత్రి పదవి కోసం రిషి సునక్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం . ఈ క్రమంలోనే ఆయన భార్య అక్షతా మూర్తి కూడా యాక్టివ్‌గా మారారు. అక్షత ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె. సునక్‌తో పాటు లిజ్ ట్రుజ్, బెన్ వాలెన్స్, మిచెట్ గోవ్, సాజివ్ జావిద్ కూడా ప్రధాని మంత్రి రేసులో ఉన్నారు.

భారతీయుడికా..? పాకిస్థానీకా?

సునక్.. పూర్తిగా భారతీయుడన్న సంగతి తెలిసిందే. ఆయన గనుక బ్రిటన్ ప్రధాని అయితే అది భారత్ కు గర్వకారణమే. సునక్.. ఈస్ట్ ఆఫ్రికా నుంచి యూకేకు వలస వెళ్లిన దంపతులకు,యూకేలోనే పుట్టారు. 200 ఏళ్లు అవిభక్త భారత్ ను పరిపాలించిన బ్రిటన్ అత్యున్నత గద్దెపై మన ప్రతినిధి అధిష్ఠించినట్లు అవుతుంది. ఇక బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న మరో వ్యక్తి రిషీ సునక్. ఈయన పాకిస్థాన్ సంతతికి చెందిన వారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. 1960 ల్లో వీరి కుటుంబం బ్రిటన్ కు వలస వెళ్లింది. ఆయన తండ్రి బస్ డ్రైవర్. లాంక్ షైర్ నుంచి వీరి కుటుంబం కొన్నాళ్లకు బ్రిస్టల్ కు మారింది. కాగా, జావిద్ సైతం బ్రిటన్ లోనే పుట్టారు. వీరిద్దరిలో ఎవరు ప్రధాని అయినా చరిత్రే. ఇద్దరూ అవిభక్త భారత్ మూలాలు ఉన్నవారు కావడమే ఇందుకు కారణం.