Begin typing your search above and press return to search.

ఇక తప్పదు వృద్దులను వదిలేయండి!

By:  Tupaki Desk   |   2 April 2020 4:36 PM GMT
ఇక తప్పదు వృద్దులను వదిలేయండి!
X
కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తుంది. కేసుల సంఖ్య పదిలక్షలకు చేరింది. ఈ సమయంలో పలు దేశాలు చేతులు ఎత్తేస్తున్నాయి. ప్రభుత్వాలు ఆర్థిక పరిస్థితిని కూడా వదిలేసి లాక్‌ డౌన్‌ లు అమలు చేస్తున్నా కూడా పరిస్థితి మాత్రం అదుపులోకి రావడం లేదు. కరోనా వైరస్‌ ఎక్కువగా వృద్దులపై ప్రభావం చూపుతుంది. అనారోగ్యాలతో బాధపడుతున్న వృద్దులకు కరోనా ఎటాక్‌ అయితే వారు బతికే ఛాన్స్‌ చాలా తక్కువ అని ఇప్పటికే పలు కేసుల విషయంలో నిర్థారణ అయ్యింది.

ఈ సమయంలో వృద్దులను వదిలేసి యువకులను మద్యవయస్కులను అయినా కాపాడలని కొన్ని దేశాల ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి. మరి కొన్ని దేశాల్లో వృద్దులు స్వచ్చందంగా తమకు చికిత్స వద్దని కరోనా పాజిటివ్‌ తో మృతి చెందేందుకు సిద్దం అవుతున్నారు. కరోనా సోకిన వారికి ఐసోలేషన్‌ లో ఉంచి వెంటిలేటర్‌ అమర్చాల్సి ఉంటుంది. అయితే అంత మందికి వెంటిలేటర్‌ అందించడం ఏ దేశంలో కూడా సాధ్యం అవ్వడం లేదు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌ లో ప్రభుత్వం షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. కరోనాతో మంచం పట్టిన వృద్దుల ఆరోగ్యం మెరుగు పడే పరిస్థితి ఉన్నా కూడా వారికి వెంటిలేటర్‌ పెట్టవద్దంటూ మార్గదర్శకాలు జారీ చేసింది.

ఇది చట్టపరంగా న్యాయబద్దం కాదు. కాని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంతకు మించి ఏం చేయలేని పరిస్థితి ఉందని బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది. వైధ్యులు ఇందుకు నిరాకరించినా కూడా ప్రభుత్వం మాత్రం వారితో బలంగా ఆ పని చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. లండన్‌ హాస్పిటల్స్‌ లో వైధ్యుల కొరత తీవ్రంగా ఉన్న ఈ సమయంలో వృద్దుల ఆరోగ్యం విషయమై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తుంది. ఇదే పరిస్థితి పలు దేశాల్లో కనిపిస్తుంది.

కరోనా కరాళ నృత్యం నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా మానవత్వంను వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనాను కట్టడి చేసేందుకు కొరియా నియంత కిమ్‌ కరోనా పాజిటివ్‌ అని తెలిస్తే చంపేయమని ఆదేశాలు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే పరిస్థితి ఇతర దేశాల్లో కూడా అమలు చేయాల్సి వస్తుందేమో అనే ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ విపత్తు నుండి ప్రపంచం ఎప్పటికి బయట పడుతుందో ఎవరు కూడా చెప్పలేక పోతున్నారు.