Begin typing your search above and press return to search.

ప్లాస్టిక్ సంచుల్లో బాడీపార్ట్స్... ఎవరివో తెలిశాయి!

By:  Tupaki Desk   |   7 Jun 2023 6:32 PM GMT
ప్లాస్టిక్ సంచుల్లో బాడీపార్ట్స్... ఎవరివో తెలిశాయి!
X
వారం రోజుల క్రితం ఉత్తర అమెరికా లోని మెక్సికో లో అతి భయంకరమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది. వరుస గా నమోదవుతున్న మిస్సింగ్ కేసుల నేపథ్యం లో... కనిపించకుండా పోయిన యువతీయువకుల గురించి విచారణ జరుపుతోన్న సమయంలో దాదాపు 45 బ్యాగుల్లో మానవ శరీర భాగాల ను పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ బ్యాగుల్లో ఉన్న శరీర బాగాలు ఎవరివనే విషయాన్ని తేల్చేశారు పోలీసులు!

జాలిస్కో రాష్ట్రం లోని ఇండస్ట్రియల్ పార్కు సమీపం లోని ఓ లోయల్ 45 బ్యాగులు బయటపడ్డాయి. అందులో మానవ శరీర భాగాలు ఉండటం తో పోలీసులు, అధికారులు షాక్‌ కు గురయ్యారు. అవి స్త్రీ, పురుషుల శరీర భాగాల ని స్టేట్ ప్రాసిక్యూట్ ఆఫీస్‌ ఓ ప్రకటన లో వెల్లడించింది. అయితే ముందుగా అధికారులు, పోలీసులూ అనుమానించినట్లుగానే... వీరంతా స్థానికంగా ఉన్న కాల్ సెంటర్ ఉద్యోగులే అని తేలింది.

అయితే వీరిని హత్యచేయడాని కి గల కారణం మాత్రం అత్యంత దారుణంగా ఉంది. రియల్ ఎస్టేట్ స్కామ్‌ లో అమెరికన్ల ను లక్ష్యంగా చేసుకున్న డ్రగ్ కార్టెల్ నిర్వహిస్తున్న కాల్ సెంటర్‌ లో ఈ హత్యలు జరిగాయని.. ఈ హత్య కు గురైన వారిలో ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నరని పోలీసులు తేల్చారు. అయితే... ఉద్యోగం మానేస్తామని చెప్పినందుకు ఈ ఎనిమిది మందిని దారుణంగా హత్య చేశారని తెలుస్తుంది.

మెక్సికో లోని గువాడలజరా సమీపంలో జలిసో న్యూ జనరేషన్‌ కార్టెల్‌ ఆధ్వర్యంలో ఆ కాల్‌ సెంటర్‌ నడుస్తోంది. మెక్సికో లోనే అత్యంత హింసాత్మక ముఠాగా పేరున్న ఈ జలిసో... మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దోపిడీ, కిడ్నాప్‌ లు చేస్తుంటుంది. ఈ క్రమం లో బ్రతుకు దెరువు కోసం బయలు దెరిన కొంతమంది నిరుద్యోగులు తెలిసో తెలియకో ఆ గ్యాంగ్ కు చిక్కుతుంటారు.

అనంతరం వాస్తవాలు తెలుసుకుని వారు ఆ గ్యాంగ్ నుంచి బయటపడాలనే ప్రయత్నాలు చేస్తుంటారు. దీంతో... ఆ గ్యాంగ్ సభ్యుల కు అనుమానం వచ్చినా, తప్పించుకుంటున్న సమయం లో దొరికినా... మరణమే శిక్ష! ఈ నేపథ్యంలో అందులో పని చేస్తున్న 8 మంది మే 20, 22 మధ్య తప్పిపోయారు. వీరికోసం గాలిస్తున్న సమయంలోనే 45 ప్లాస్టిక్ సంచుల్లో మృతదేహ భాగాలు లభ్యమయ్యాయి.

అనంతరం ఆ సంచుల్లోని శరీర భాగాల ను ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ కు పంపించగా... ఇవి తప్పిపోయిన వారి శరీర భాగాలే అని తేలింది. దీంతో... కనిపించకుండా పోయిన ఆ 8 మంది హత్యకు గురయ్యారని అమెరికా, మెక్సికో అధికారులు తెలిపారు.