Begin typing your search above and press return to search.

అక్కడ బిట్ కాయిన్ లీగల్.. ప్రపంచంలోనే తొలి దేశం

By:  Tupaki Desk   |   10 Jun 2021 4:15 AM GMT
అక్కడ బిట్ కాయిన్ లీగల్.. ప్రపంచంలోనే తొలి దేశం
X
బిట్ కాయిన్ ను ఇప్పుడు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే.. ఎవరెన్ని చెప్పినా దీనికి చట్టబద్ధత లేదన్న విషయం తెలిసిందే. అయితే.. అందుకు భిన్నంగా తాజాగా ఒక దేశం బిట్ కాయిన్ కు చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో మొదటిసారి ఒక దేశం క్రిప్టో కరెన్సీని గుర్తించటం.. ఎలాంటి లావాదేవీకైనా బిట్ కాయిన్ వాడొచ్చంటూ అక్కడి చట్టసభ ఓకే చెప్పింది.

ఇంతకీ ఆ దేశం ఏమిటంటారా? అక్కడికే వస్తున్నాం. ఎల్ శాల్వడార్. బిట్ కాయిన్ కు చట్టబద్దత కల్పించి తొలిదేశంగా చెప్పాలి. ఈ క్రిప్టో కరెన్సీని స్వీకరించటానిక తగినంత సాంకేతికత అందుబాటులో లేని సంస్థలు మినహా మిగిలిన వ్యాపార సంస్థలు బిట్ కాయిన్ మారకంలో చెల్లింపుల్ని స్వీకరించొచ్చని ఎల్ శాల్వడార్ ప్రకటించింది.

వాస్తవానికి ఆ దేశానికి అమెరికా డాలర్ అధికారిక కరెన్సీగా గుర్తింపు ఉంది. తాజాగా అక్కడి చట్ట సభ క్రిప్టో కరెన్సీ చెల్లింపులకు ఓకే చెప్పటంతో.. ఈ డిజిటల్ కరెన్సీకి చట్టబద్ధత వచ్చినట్లైంది. అయితే.. ఈ కరెన్సీతో లావాదేవీలు జరపటం కోసం ప్రజల్లో శిక్షణ కల్పించే ప్రయత్నం అక్కడి ప్రభుత్వం చేయనుంది.

తాజాగా తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో రానున్న తొంభై రోజుల్లో ఈ చట్టం అమల్లోకి రానుంది. అయితే.. తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనయ్యే బిట్ కాయిన్ మారకం విలువ పరంగా ఆ దేశ ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.అయితే.. అలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.