Begin typing your search above and press return to search.

ధోనీ దందాకు బర్డ్​ఫ్లూ ఎఫెక్ట్​.. భారీగా ఆర్డర్లు రద్దు..!

By:  Tupaki Desk   |   14 Jan 2021 5:37 AM GMT
ధోనీ దందాకు బర్డ్​ఫ్లూ ఎఫెక్ట్​..  భారీగా ఆర్డర్లు రద్దు..!
X
టీం ఇండియా మాజీ కెప్టెన్​, ప్రముఖ క్రికెటర్​ మహేంద్రసింగ్​ ధోని.. కడక్​నాథ్​ కోళ్లు, హైదరాబాద్​ గ్రామప్రియ కోళ్ల వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ధోనీ వ్యాపారంపై బర్డ్​ఫ్లూ తీవ్ర ప్రభావం చూపించింది. ఇటీవలే క్రికెట్​కు గుడ్​బై చెప్పిన మహీ.. రాంచీలోని తన 43 ఎకరాల ఫామ్​హౌస్​లో ఆర్గానిగ్​ పౌల్ట్రీఫామ్​ నెలకొల్పారు. అయితే ఇందుకోసం కడక్‌నాథ్ నల్లకోళ్ళను మధ్యప్రదేశ్‌లోని ఝబువా ప్రాంతం నుంచి గ్రామప్రియ కోళ్లను హైదరాబాద్‌ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటారు.

ఇటీవల రెండువేల కోళ్లను ఆర్డర్​ చేయగా.. వాటికి బర్డ్​ఫ్లూ సోకింది. దీంతో వెంటనే ఆర్డర్​ చేసినట్టు ధోనీ ఫామ్​ హౌస్​ నిర్వాహకులు తెలిపారు. ధోని ఆర్డర్‌ చేసిన కోళ్లు బర్డ్‌ఫ్లూ బారిన పడ్డాయని కోళ్ల పంపకందారుడు డాక్టర్‌ విశ్వరాజన్‌ ధ్రువీకరించారు. ధోనీ ఫామ్​లో పెంచుతున్న ఈ కోళ్లకు ఎంతో డిమాండ్​ ఉంది.. కడక్‌నాథ్‌ చికెన్‌ ధర కేజీకి రూ. 900 నుంచి రూ. 1,200 వరకు, గ్రామప్రియ చికెన్‌ కూడా ఇంచుమించు అంతే ధర పలుకుతుంది. బర్డ్​ఫ్లూ ఎఫెక్ట్​తో ఇప్పటికే మనదేశంలో కోళ్ల పరిశ్రమ కుదేలయ్యింది.

తెలుగురాష్ట్రాల్లో చికెన్​ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ధరలు భారీగా తగ్గించినా చికెన్​ను ప్రజలు కొనుగోలు చేయడం లేదు. మధ్యప్రదేశ్‌, కేరళ, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ప్రస్తుతం బర్డ్​ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతం మిగతా రాష్ట్రాలకు కూడా బర్డ్​ఫ్లూ నిదానంగా పాకుతోంది. చికెన్​ను బాగా ఉడికించుకొని తింటే బర్డ్​ ఫ్లూ ఎఫెక్ట్​ కాస్త తక్కువగానే ఉంటుందని వైద్యులు అంటున్నారు. అయినప్పటికీ ప్రజల్లో భయం పోవడం లేదు.